బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పుడు మళ్ళీ వరుస పెట్టి పోస్ట్ పోన్ లు అవుతూ ఉన్నాయి, ఇలాంటి టైం లో కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ కాబోతుండగా ఇండియా లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా రీసెంట్ గా రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ అండ్ సీటి మార్ సాంగ్ కి…
రెస్పాన్స్ మాత్రం ఫుల్ నెగటివ్ గా వచ్చింది, అదే రొట్ట కొట్టుడు కథ అని అలానే DJ సీటి మార్ తో పోల్చితే ఈ సీటి మార్ మినిమం ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేక పోయింది. ఇక సినిమా మే 13 న డిజిటల్ లో అలాగే థియేటర్స్ తెరచి ఉంటె అక్కడ…
ఒకే సారి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి టికెట్ రేటు ని ఇది వరకు 299 గా ఫిక్స్ చేశారు. దాంతో అంత రేటు పెట్టి ఒక్క సినిమా చూసే కన్నా మరింత మనీ యాడ్ చేసి ఒక ఏడాది…
అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ లాంటి యాప్స్ లో సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో తెగ ట్రోల్స్ జరిగాయి, దాంతో వీటి పై స్పందించిన టీం 299 రేటు నుండి ఇప్పుడు సినిమా టికెట్ రేటు ని తగ్గించి ఒక్కో టికెట్ రేటు 249 గా ఫిక్స్ చేసింది ఇప్పుడు.
నార్మల్ గా మల్టీ ప్లెక్సులలో ఒక టికెట్ యావరేజ్ గా పెద్ద హీరో సినిమా 200 నుండి 250 వరకు ఉండటం కామన్ కాబట్టి ఇప్పుడు ఆ టికెట్ రేటు పై టోటల్ ఫ్యామిలీ సినిమా చూడొచ్చు కాబట్టి ఈ రేటు తో సినిమా కి పే పెర్ వ్యూ పద్దతిలో సాలిడ్ వ్యూస్ వస్తాయని మేకర్స్ ఆశిస్తున్నారు, మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.