బాలీవుడ్ ఇప్పట్లో కోలుకునేలా అయితే కనిపించడం లేదు, థియేటర్స్ అక్కడ ఎప్పుడు తెరచుకుంటాయో, ఎప్పుడు ఏ ఇబ్బందులు వస్తాయో, అసలు జనాలు థియేటర్స్ కి వస్తారో రారో అన్న డౌట్ లో ఉన్న టైం లో ఇప్పుడు సెకెండ్ వేవ్ మరింత భారీగా ఎదురుదెబ్బ కొట్టడం తో ఎక్కడికక్కడ సినిమాలు అన్నీ రిలీజ్ లు ఆపేసి ఇప్పుడు సైలెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దాంతో చాలా సినిమాలు ఇక ఇప్పుడు థియేటర్స్ లో…
రిలీజ్ లు చేసుకోలేం కాబట్టి సినిమాలను ఇక డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసుకోవడమే బెటర్ అని ఫీల్ అవుతూ ఉండగా ఈ గ్యాప్ లో ముందు ఏ సినిమా రిలీజ్ ఫిక్స్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తుండగా అందరికీ షాకిస్తూ ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్…
సల్మాన్ ఖాన్ తను నటించిన లేటెస్ట్ మూవీ రాధే ని ఈ మే నెలలో 13 న రంజాన్ కానుకగా అటు థియేటర్స్ తెరచి ఉంటె థియేటర్స్ లో అలాగే అదే రోజున డిజిటల్ రిలీజ్ కూడా చేయబోతున్నట్లు కన్ఫాం చేశాడు. డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో ఈ సినిమాను ఇప్పుడు…
అదే రోజున రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. అంటే థియేటర్స్ లో ఆంక్షల నడుమ చూడాలి అనుకున్న వాళ్ళు అక్కడా అలాగే థియేటర్స్ లో చూడలేని వాళ్ళు పే పెర్ వ్యూ పద్దతిలో జీ ప్లేక్స్ యాప్ లో సినిమా కి డబ్బులు పెట్టి ఇంట్లోనే చూడొచ్చు అన్న మాట.. ఇప్పటి వరకు మీడియం రేంజ్ మూవీస్ విషయం లోనే ఇది జరగగా అంతగా సక్సెస్ కాలేదు.
దాంతో ఇప్పుడు సల్మాన్ సినిమాకి వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఇతర సినిమాలు కూడా ఇదే పద్దతి ని ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సల్మాన్ నిర్ణయం బాలీవుడ్ వాళ్లకి షాకిచ్చినా ప్రస్తుత పరిస్థితులల్లో ఇంతకి మించి చేసేది ఏమి లేకపోవడం తో ఇది సఫలం అవ్వాలనే అందరూ కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక….