Home గాసిప్స్ 40 కోట్లతో 250 కోట్లు…హీరో రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!!

40 కోట్లతో 250 కోట్లు…హీరో రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!!

0

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ వ్యూస్ మాత్రం సాలిడ్ గా దక్కించుకుని అత్యంత భారీ రేటు పెట్టి కొన్న జీ నెట్ వర్క్ కి రెవెన్యూ బాగానే దక్కేలా చేస్తూ వస్తుండటం విశేషం అనే చెప్పాలి.

ఎప్పుడో లాస్ట్ ఇయరే రావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఈ రంజాన్ కి రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా సినిమా కి ఏమాత్రం టాక్ పాజిటివ్ గా లేకున్నా మొదటి రోజే 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ దక్కగా వీకెండ్…

పూర్తీ అయ్యే టైం కి అన్నీ కలుపుకుని ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఇక ఈ సినిమా ను సల్మాన్ ఖాన్ తన రెమ్యునరేషన్ పక్కకు పెట్టి మొత్తం మీద 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే నిర్మించారు. సినిమా బిజినెస్ మొత్తం…

కంప్లీట్ అయ్యాక సినిమా కి రెమ్యునరేషన్ తీసుకున్నారట సల్మాన్ ఖాన్, తన రెమ్యునరేషన్ పరంగా ఓవరాల్ గా సినిమా బిజినెస్ లో 50% షేర్ సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ కింద వెళుతుందని సమాచారం. అంటే సినిమా ను మొత్తం మీద జీ నెట్ వర్క్ వాళ్లకి గంపగుత్తుగా ఏకంగా 250 కోట్ల రేంజ్ కి అన్ని రైట్స్ కలిపి అమ్మారని సమాచారం…

ఆ లెక్కన సినిమా కి రెమ్యునరేషన్ పరంగా సల్మాన్ ఖాన్ కి ఏకంగా 125 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ దక్కి ఉండొచ్చని అంటున్నారు. ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి, కానీ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యి ఉంటే రెమ్యునరేషన్ అలాగే లాభాలు మరింత ఎక్కువగా వచ్చి ఉండేవని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here