Home న్యూస్ సామజవరగమనా రివ్యూ….రీసెంట్ టైంలో బెస్ట్ మూవీ!!

సామజవరగమనా రివ్యూ….రీసెంట్ టైంలో బెస్ట్ మూవీ!!

0

బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర లాంటి ఎంటర్ టైనర్స్ తో మంచి హిట్స్ కొట్టిన శ్రీ విష్ణు(Sree vishnu) తర్వాత చేసిన ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ కానీ రొటీన్ మూవీస్ కానీ అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైంలో తనకి కలిసి వచ్చిన ఎంటర్ టైన్ మెంట్ జోనర్ నే ఎంచుకుని ఇప్పుడు…

ఆడియన్స్ ముందుకు సామజవరగమనా(Samajavaragamana) సినిమాతో వచ్చేశాడు.. ట్రైలర్ ఆసక్తిని పెంచడంతో సినిమా మీద డీసెంట్ అంచనాలు ఏర్పడగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉందో ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

మల్టీప్లెక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర పని చేసే హీరో తన తండ్రిని డిగ్రీ చదివిస్తూ ఉంటాడు, దానికి ఒక స్టొరీ ఉంటుంది, తన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ హీరోని చూసి ఇష్టపడుతుంది, హీరోయిన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. హీరోకి ఉన్న సమస్యలను హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

స్టొరీ పాయింట్ నార్మల్ గానే ఉన్నప్పటికీ ఎంటర్ టైన్ మెంట్ విషయంలో మాత్రం సినిమా ఫస్టాఫ్ హిలేరియస్ గా వర్కౌట్ అయింది. సీనియర్ నరేష్ కామెడీ ఫస్టాఫ్ కి మేజర్ ప్లస్ పాయింట్ కాగా హీరో హీరోయిన్స్ లవ్ స్టొరీ కూడా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది. ఇక సెకెండ్ ఆఫ్ కథ కొంచం ఫస్టాఫ్ తో పోల్చితే కొంచం ఫ్లో తగ్గినా కానీ…

ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సాగిన సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మెప్పించింది అని చెప్పాలి. శ్రీవిష్ణు తన రోల్ లో అదరగొట్టేశాడు, కామెడీతో మెప్పించగా, సీనియర్ నరేష్ కామెడీ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ పర్వాలేదు అనిపించగా… మిగిలిన రోల్స్ అన్నీ కూడా తమ రోల్స్ లో బాగానే కామెడీని పండించారు….

కథ చాలా సింపుల్ గా ఉన్నా ఎంటర్ టైన్ మెంట్ విషయంలో కానీ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ కూడా అవ్వడం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. కామెడీ విషయంలో ఫస్టాఫ్ సినిమా టికెట్ డబ్బులకు వర్త్ అని చెప్పొచ్చు. పాటలు బిలో యావరేజ్ గా ఉండటం, అక్కడక్కడా కొన్ని సీన్స్ ఓవర్ ది టాప్ అనిపించేలా ఉన్నట్లు అనిపించడం లాంటివి…

ఇబ్బంది పెట్టినా సినిమా అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఓ మంచి సినిమాను చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం మాత్రం ఖాయమని చెప్పాలి. బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర తర్వాత మళ్ళీ శ్రీవిష్ణు తనకి కలిసి వచ్చిన జానర్ లో ఆడియన్స్ ను బాగా మెప్పించాడు… సినిమా కి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here