SR కళ్యాణ మండపం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం తర్వాత చేసిన సెబాస్టియన్ సినిమా ఫ్లాఫ్ అవ్వగా ఈ సినిమా తర్వాత ఆడియన్స్ లో కొద్ది వరకు అంచనాలను పెంచిన సినిమాగా సమ్మతమే నిలుస్తుంది, చాందిని చౌదరీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ పర్వాలేదు అనిపించగా సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన హీరో ఇంట్లో ఆడవాళ్ళూ ఉంటే బాగుంటుందని అనుకుంటాడు, అప్పటి నుండి పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉండగా తనకి హీరోయిన్ కనిపిస్తుంది. ముందు కుదరకపోయినా తర్వాత వీళ్ళు ప్రేమలో పడతారు… తర్వాత ఓ చిన్న కారణం వలన గొడవలు స్టార్ట్ అవ్వగా తర్వాత ఏం జరిగింది, వీళ్ళు కలిసారా లేదా అన్నది అసలు కథ…
కథ పాయింట్ చాలా సింపుల్ గా ఒక్క లైన్ లో చెప్పేదిగా ఉండగా పెర్ఫార్మెన్స్ పరంగా కిరణ్ అబ్బవరం పర్వాలేదు అనిపించే విధంగా నటించి మెప్పించాగా చాందిని చౌదరీ కూడా ఆకట్టుకుంది, అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగానే ఆకట్టుకున్నాయి, కానీ ఈ తిన్ స్టొరీ లైన్ ని చెప్పిన విధానం చాలా నెమ్మదిగా ఉండటంతో…
ఒక స్టేజ్ దాటాక బోర్ అనిపించడం ఖాయం. సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ వీక్ గా ఉంది, ఇక సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి, డైరెక్షన్ విషయానికి వస్తే…. ప్రజెంట్ జనరేషన్ కి తగ్గట్లు కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ మెప్పించినా కానీ కథ పరంగా వీక్ గా ఉండటం కథనం చాలా నెమ్మదిగా సాగడం, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ తక్కువగా ఉండటంతో….
కొన్ని మంచి సీన్స్ పడినా కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించలేదు…. ఉన్నంతలో లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్ కోసం, కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ కోసం కొంచం ఓపిక చేసుకుని చూస్తె సినిమా పర్వాలేదు అనిపించవచ్చు…. మొత్తం మీద ఒకసారి చూసేలా ఉన్న సమ్మతమే సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….