Home న్యూస్ డైరెక్టర్ Vs సమంత – చిన్మయి – అనసూయ…సోషల్ మీడియా ట్రోల్ నేషనల్ లెవల్ కి...

డైరెక్టర్ Vs సమంత – చిన్మయి – అనసూయ…సోషల్ మీడియా ట్రోల్ నేషనల్ లెవల్ కి వెళ్ళింది

0

అర్జున్ రెడ్డి తో టాలీవుడ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఆ సినిమా తో ఇక్కడ అనేక విమర్శలు కూడా ఎదురుకున్నాడు. కానీ ఆ విమర్శల కి పదిరెట్లు ఇప్పుడు హిందీ లో విమర్శలను ఎదురుకుంటూన్నాడు ఈ దర్శకుడు. ఇదంతా రాజీవ్ మసంద్ అనే క్రిటిక్ సినిమా కి 2 స్టార్ రేటింగ్ ఇవ్వడం నుండి మొదలు అయింది.

దాంతో పాటు సినిమాలో విషపూరితమైన మగతనాన్ని చూపెట్టారని, కామెంట్స్ చేశారు, దాంతో మరో ఇంటర్వ్యూలో డైరెక్టర్…. అందరినీ గట్టిగా విమర్శించాడు. దాంతో పాటు “స్వచ్చమైన ప్రేమ లో ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకునే స్వేచ్చ కూడా లేకపోతె అది నిజమైన ప్రేమ కాదు” అంటూ కామెంట్ చేశాడు డైరెక్టర్… అది అర్ధం చేసుకునే ఫెమినిస్టులు లేరని అన్నాడు.

దాంతో అటు బాలీవుడ్ నుండి ఇటు టాలీవుడ్ దాకా ఉన్న ఫెమినిస్టులు స్వచ్చమైన ప్రేమ అలాగే ఒకరినొకరు అన్న పదాలు పక్కకు పెట్టి ఆడవాళ్ళ ని కొట్టడాన్ని దర్శకుడు ఎంకరేజ్ చేస్తున్నాడని ఇది విషపూరితమైన మగతనం అని కామెంట్స్ చేస్తూ పోస్ట్లులు పెట్టడం మొదలు పెట్టారు.

ముందుగా హీరోయిన్ సమంత పోస్ట్ చేయగా తర్వాత చిన్మయి సీన్ లోకి ఎంటర్ అయ్యి వరుస పోస్టులతో ట్విట్టర్ లో పెద్ద త్రెడ్ నే పెట్టేసింది. అందులో “ఒక అబ్బాయి నిజంగా ప్రేమిస్తే తను ప్రేమించిన అమ్మాయి పై చేయి చెసుకోడని, అలాగే తన భర్త తనపై ఇప్పటి దాకా చేయి చేసుకోలేదని చెప్పింది”. తర్వాత నుండి మొదలు అయింది అసలు కథ…

ఒక్కసారిగా వీరి పై ట్రోల్స్ పీక్స్ కి వెళ్ళాయి… ఫెమినిస్టులు అంటే ఆడవాళ్ళకి సమాజంలో జరిగే అపాయలపై సమాన హక్కుల కోసం పోటి చేయాలనీ కానీ వీళ్ళు ఇలా సోషల్ మీడియా లో పోస్టులతోనే సరిపెట్టుతున్నారని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

తర్వాత సమంత పై కామెంట్స్ చేస్తూ అర్జున్ రెడ్డి బాగుందని కామెంట్ చేసి ఇప్పుడు కబీర్ సింగ్ పై ఇలా విమర్శించడం బాలేదని కామెంట్స్ చేయగా… ఇష్టపడటం వేరు జనరల్ స్టేట్ మెంట్స్ ని వ్యతిరేకించడం వేరు… అమ్మాయి పై చేయి చేసుకోవడం ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోను అంటూ కామెంట్స్ చేసింది. తర్వాత చిన్మయి కూడా అదే కామెంట్ చేసింది.

ఇక చూసుకోండి… వీరి సినిమాల్లో చేసిన సీన్స్ ని ఒక్కొటిగా స్క్రీన్ షాట్స్ తీస్తూ ఇలాంటి సీన్స్ చేసినప్పుడు దర్శకుడిని ఎదిరించలేదెందుకు అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టి సందీప్ రెడ్డి వంగ కి సపోర్ట్ గా “WeSupportSandeepReddyVanga” అంటూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేశారు.

సమంత నటించిన సినిమాల్లో దూకుడు, కత్తి, రంగస్థలం లాంటి సినిమాల్లో హీరోలు చెంప దెబ్బ కొట్టినప్పుడు ఏమి వ్యతిరేకించలేదని, అలాగే తాను ఇప్పుడు నటించిన ఓ బేబీ లో “మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలి” అంటూ కామెంట్స్ ఎందుకు చేసిందని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇక చిన్మయి భర్త అయిన రాహుల్ నటించిన కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ ని చెంపదెబ్బ కొట్టడాన్ని ఎందుకు ప్రశ్నించలేదని, పైన చెప్పిన డైలాగ్ కి డబ్బింగ్ చెప్పే టప్పుడు “ఇలాంటి పదాలు చెప్పను అని ఎందుకు వ్యతిరేకించలేదంటూ విమర్శించారు.

వీరిని ఇలాంటి ప్రశ్నలు అడిగిన వారి ట్వీట్స్ ని బ్లాక్ చేస్తూ కొందరు నోటిదురుసు తో మాట్లాడిన పాదాలను రీ ట్వీట్ చేస్తూ ఇలాంటి వారు ఉన్నారు అంటూ వీళ్ళు మరింత పెంచారు. ఇక మధ్యలో యాంకర్ అనసూయ అర్జున్ రెడ్డి సమయంలోనే నేను చెప్పాను అంటూ చిన్మయి కి రిప్లీ ఇచ్చింది.

ఆ సినిమాలో వాడిన పదం ఎంతో భాదించింది అంటూ అప్పట్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది మళ్ళీ గుర్తు చేస్తూ మీరు ఎవ్వరు అప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేయగా… సోషల్ మీడియా జనాలు ఆమె వైపు కూడా ట్రోల్ మొదలు పెట్టారు.

జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి, ఆడవాళ్ళ పై చేసే వెకిలి కామెంట్స్ కి ఎగబడి నవ్వే నువ్వు కూడా కామెంట్స్ చేస్తున్నావా అంటూ కొందరు, ఒక షో లో మందు తాగితేనే కిక్ వస్తుందా అనసూయ తో రాదా అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టిన నువ్వు కూడా నీతులు చెబుతున్నావా అంటూ ఆమె ని కూడా భారీగా ట్రోల్ చేశారు.

అది వృత్తి ఇది బయట అంటూ కామెంట్స్ చేసినా… అది సినిమా… సినిమాను సినిమాలా చూడకుండా ఇలా అందులో తప్పులు వెతికి పబ్లిసిటీ చేసుకుంటున్నారా అంటూ మరింత రెచ్చిపోయారు. ఫెమినిస్టులు గా చెప్పుకుంటున్న మీరు… రీసెంట్ గా 9 నెలల అమ్మాయి పై, అలాగే 8 ఏళ్ల పాపపై రేప్ అయితే ఒక్క కామెంట్ చేయలేదని… అంతెందుకు…

ఇండస్ట్రీ లైంగిక దాడులు ఎదురుకుంటున్నాం అంటూ చాలా మంది బయటికి వచ్చి కామెంట్స్ చేస్తే వీళ్ళు ఎక్కడున్నారని అంటున్నారు, అందులో శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు ఒక టాప్ ప్రొడ్యూసర్ కొడుకు తో దిగిన ఫోటోలు బయట పెడితే ఒక్కరు స్పందించలేదని….అలాగే…

ఆడవాళ్ళ పై బాలయ్య అలాగే చలపతిరావు చేసిన కామెంట్స్ పై కూడా స్పందించలేదని, మొత్తం మీద తమ సినిమాల లో లొసుగులు పట్టించుకోని వీరు ఇతర సినిమాల పై మాత్రం కామెంట్స్ చేయడానికి సిద్ధంగా ఉంటారని ట్రోల్ చేశారు. మొత్తం మీద ఆదివారం అలాగే సోమవారం చాలా వరకు ఈ ట్రోలింగ్ కొనసాగింది.

మొత్తం మీద తప్పు అన్ని వైపులా ఉన్నా… ఫెమినిస్టులుగా చెప్పుకుంటున్న వీళ్ళు కొన్ని సందర్బాలలో సైలెంట్ గా ఉండి, ఇలా కొన్ని సందర్బాలలో అతిగా స్పందించడం తప్పు అని చెప్పొచ్చు…. సమాజంలో స్త్రీ లు ఎన్నో సమస్యలు ఎదురుకున్తున్నారు. వాటి ఫై వీరి పోరాటం మరింత ఎక్కువగా ఉంటె బాగుంటుంది. ఇక సినిమా ని సినిమాగా చూడకుండా అందులో…ప్లస్సులు మైనస్ లు వెతికే రివ్యూవర్లకి మించి తప్పులు వెతకడం మానితే మంచింది అని చెప్పొచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here