బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి చివరి సినిమా వచ్చేసింది…విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది…సినిమా మీద ఆల్ రెడీ ఫుల్ బజ్ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే….ఎక్స్ పోలిస్ అయిన హీరో ఊర్లో తన ఫ్యామిలీతో కలిసి హ్యాప్పీగా ఉంటాడు…ఈ క్రమంలో తన ఎక్స్ లవర్ అయిన మీనాక్షి చౌదరి ఒక సీరియస్ కేస్ సాల్వ్ చేయడానికి హీరో హెల్ప్ అడుగుతుంది…వీళ్ళ గురించి తెలిసిన హీరో వైఫ్ నేను ఈ మిషన్ లో జాయిన్ అవుతాను అంటుంది…ఇంతకీ ఆ కేస్ ఏంటి….ఆ తర్వాత కథ ఏమయింది అన్నది అసలు కథ….
ముందుగా ఇది ఎదో సీరియస్ టోన్ తో సాగే కథో లేక న్యూ ఏజ్ స్టోరీనో కాదు అన్న విషయం ఆల్ రెడీ టీం ఆడియన్స్ కి చెప్పేశారు…దాంతో కథ పరంగా మరీ అద్బుతాలు ఎవ్వరూ ఊహించలేరు…సినిమాలో కూడా స్టోరీ పాయింట్ పెద్దగా ఏమి ఉండదు….కానీ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సీన్స్ తో…
స్టార్ట్ టు ఫినిష్ చాలా చోట్ల కామెడీ ఎక్స్ లెంట్ గా వర్కౌట్ అవ్వడంతో పెద్దగా బోర్ ఏమి ఫీల్ అవ్వకుండా సినిమా మంచి టైం పాస్ ఎంటర్ టైనర్ గా సాగుతుంది…ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇది కొంచం క్రింజ్ కామెడీలా అనిపించినా కూడా మిడిల్ ఏజ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది….
ఎప్పటి లానే విక్టరీ వెంకటేష్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా…ఎఫ్2-ఎఫ్3 లో లౌడ్ క్యారెక్టర్ కాకుండా ఈ సారి కొంచం సటిల్డ్ కామెడీతో కుమ్మేశాడు….సినిమాలో వెంకీ కొడుకు రోల్ చేసిన చిన్నోడు ఫస్టాఫ్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాడు….తన కామెడీ టైమింగ్, కొన్ని హిలేరియస్ సీన్స్ పడ్డాయి….ఇక హీరోయిన్స్ ఇద్దరూ పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకున్నారు….
మిగిలిన యాక్టర్స్ కూడా బాగానే ఆకట్టుకోగా…పాటలు ఆల్ రెడీ మంచి హిట్ అవ్వగా విజువల్ గా కూడా బాగున్నాయి…బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు….ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గానే ఉంటుంది కానీ పెద్దగా బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది…ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది…
ఇక అనిల్ రావిపూడి మరోసారి ఆడియన్స్ తన నుండి ఎలాంటి సినిమా ఎక్స్ పెర్ట్ చేస్తున్నారో అలాంటి మూవీనే ఇచ్చారు….స్టోరీ సింపులే అయినా కూడా కామెడీ సీన్స్ తో ఎంత వీలయితే అంత జనాలను నవ్వించాలని కొన్ని హిలేరియస్ సీన్స్ రాసుకున్నాడు కానీ ఫస్టాఫ్ లో వర్కౌట్ అయినంత కామెడీ సెకెండ్ ఆఫ్ లో…
కొన్ని చోట్ల కథ కొంచం సీరియస్ అవ్వాల్సి రావడంతో స్కోప్ దొరకలేదు…దాంతో ఫస్టాఫ్ హిలేరియస్ గా అనిపిస్తే సెకెండ్ ఆఫ్ కూడా బాగుంది అనిపించినా ఫస్టాఫ్ రేంజ్ హిలేరియస్ గా అనిపించలేదు…. మొత్తం మీద వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబోలో వచ్చిన 3 సినిమాల్లో…
ఎఫ్3 కన్నా చాలా బెటర్ గా….ఆల్ మోస్ట్ ఎఫ్2 రేంజ్ కి ఈక్వల్ అనిపించే రేంజ్ లో సంక్రాంతికి వస్తున్నాం ఉందని చెప్పొచ్చు…ఆడియన్స్ కూడా పెద్దగా అంచనాలతో వచ్చినా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినా థియేటర్స్ కి వచ్చాక బాగానే ఎంజాయ్ చేసి బయటికి వస్తారు…ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్….