బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో అన్న డౌట్ నుండి థియేటర్స్ రీ ఓపెన్ అయ్యి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ అందులో ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి దుమ్ము లేపగా ఇప్పుడు సంక్రాంతి రేసులో బాక్స్ ఆఫీస్ దగ్గర 4 సినిమాలు పోటి పడుతూ దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాయి. మరి అవి హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసుకుందాం పదండీ..
ముందుగా జనవరి 9 న రిలీజ్ కాబోతున్న మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల బిజినెస్ ను సాధించగా వరల్డ్ వైడ్ గా 13.8 కోట్ల బిజినెస్ ని అందుకుంది. అంటే ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం 14.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక 13 న కోలివుడ్ టాప్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా తెలుగు లో కూడా భారీగా రిలీజ్ కానుండగా 8 కోట్ల బిజినెస్ ని సాధించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 8.5 కోట్ల షేర్ ని ఇక్కడ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, పోటి లో ఇది సాధిస్తే దుమ్ము లేపినట్లే లెక్క.
ఇక 14 న ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్ మూవీ భారీగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సంక్రాంతి మూవీస్ లో హైయెస్ట్ బిజినెస్ ను సాధించిన ఈ సినిమా 15 కోట్ల బిజినెస్ ని రెండు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 16 కోట్ల బిజినెస్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ కి 16.6 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి కాబట్టి సాధ్యం అవ్వొచ్చు.
ఇక పోటి లో చివరగా వస్తున్న సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 11 కోట్ల బిజినెస్ ను వరల్డ్ వైడ్ గా 11.5 కోట్ల బిజినెస్ ను సాధించగా క్లీన్ హిట్ కోసం ఇప్పుడు 12 కోట్ల కి పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది. ఇవి మొత్తం మీద సంక్రాంతి సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్లు. మరి ఈ నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.