Home న్యూస్ సప్త సాగరాలు దాటి మూవీ రివ్యూ….ఫీల్ గుడ్ మూవీ!

సప్త సాగరాలు దాటి మూవీ రివ్యూ….ఫీల్ గుడ్ మూవీ!

0

కన్నడ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి ఫీల్ గుడ్ మూవీ గా మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న రక్షిత్ శెట్టి(Rakshit Shetty) నటించిన లేటెస్ట్ మూవీ సప్త సాగరాలు దాటి(Sapta Sagaralu Dhaati) ఆడియన్స్ ముందుకు తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

క్యాబ్ డ్రైవర్ అయిన హీరో హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు. తర్వాత హీరో హీరోయిన్స్ ప్రేమించుకోగా వీళ్ళ ప్రేమకి ఎవ్వరూ అడ్డు పడరు, కానీ వీళ్ళ లైఫ్ లో తీసుకున్న ఒక నిర్ణయం ఇద్దరి లైఫ్ టర్న్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా మిగిలిన కథ…

ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్ బాగుండగా హీరో మరియు హీరోయిన్స్ ఇద్దరూ అద్బుతంగా నటించగా సెకెండ్ ఆఫ్ లో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగా మెప్పించింది. మిగిలిన యాక్టర్స్ కూడా బాగా నటించగా సినిమాలో పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి తగ్గట్లు బాగానే మెప్పించాయి.

ఎంత ఫీల్ గుడ్ మూవీ అయినా స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం, ఫస్టాఫ్ లో సినిమా కొంచం నెమ్మదిగా కథ సాగడం, సెకెండ్ ఆఫ్ లో కూడా కథ నెమ్మదిగానే సాగినా కూడా మంచి ఫీల్ ఇచ్చే సీన్స్ సెకెండ్ ఆఫ్ లో ఉండటంతో మొత్తం మీద సినిమా ఎండ్ అయ్యే టైం కి…

ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ తో బయటికి వచ్చేలా చేస్తుంది. సినిమా లెంత్ కొంచం తగ్గించి ఉంటే ఓవరాల్ గా సినిమా ఇంకా బాగా మెప్పించి ఉండేది… పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ అలాగే… ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ఇష్టపడే ఆడియన్స్…

కొంచం ఓపిక తో చూస్తె సప్త సాగరాలు దాటి సినిమా ఓ డీసెంట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెప్పించే అవకాశం ఉంది, రెగ్యులర్ మూవీస్ చూసి చూసి ఉన్న ఆడియన్స్ కి ఈ సినిమా కొంచం డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వవచ్చు… సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here