Home న్యూస్ 24 గంటలు ఔట్…రికార్డులు చెల్లాచెదురు!!

24 గంటలు ఔట్…రికార్డులు చెల్లాచెదురు!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరి లేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీసర్ భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకున్న టీసర్ ఓవరాల్ గా ఇప్పుడు 24 గంటలు ముగిసే సరికి సంచలన రికార్డులతో దుమ్ము దుమారం చేసిందని చెప్పొచ్చు. సినిమా టీసర్ టాలీవుడ్ లో చాలా రికార్డులను బ్రేక్ చేసి సత్తా చాటుకుంది.

సినిమా టీసర్ తొలి కొన్ని గంటల్లో అయితే ఫాస్టెస్ట్ 1 మిలియన్ కి తోడూ 50 వేల లైక్స్, 1 లక్ష లైక్స్ అలాగే 2 లక్షల లైక్స్ విషయం లో సంచలన రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించగా తర్వాత లైక్స్ చాలా వరకు స్లో డౌన్ అవ్వగా ఎలాగోలా 3 లక్షల లైక్స్ లో…

టాప్ 3 ప్లేసును సొంతం చేసుకున్న ఈ టీసర్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి లైక్స్ పరంగా కొత్త రికార్డులు నమోదు చేస్తుంది అనుకున్నా అలా చేయలేదు, లైక్స్ విషయంలో కొన్ని లైక్స్ ని యూట్యూబ్ డిలేట్ చేసింది, అది ఎఫెక్ట్ చూపడంతో కొత్త రికార్డులు మిస్ అయ్యాయి.

అయినా కానీ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేసిన సినిమా 24 గంటల్లో 14.64 మిలియన్స్ వ్యూస్ ని 3 లక్షల 86 వేల లైక్స్ తో సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. ఈ విషయం లో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది సరిలేరు నీకెవ్వరు సినిమా టీసర్… ఓవరాల్ గా చూసుకుంటే ఫాస్టెస్ట్ 3 లక్షలు అలాగే 4 లక్షల లైక్స్ పక్కకు పెడితే…

చాలా రికార్డులను సొంతం చేసుకున్న ఈ టీసర్ టాలీవుడ్ తరుపున 24 గంటల్లో సంచలన రికార్డులను నమోదు చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తో మహేష్ బాబు ఎలాంటి రికార్డులను పోటి లో నమోదు చేస్తాడు అన్నది అందరి లోను ఎంతో ఆసక్తిని రేపుతున్న ప్రశ్న గా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here