Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు సెన్సార్ రిపోర్ట్…మెయిన్ హైలెట్స్ ఇవే!

సరిలేరు నీకెవ్వరు సెన్సార్ రిపోర్ట్…మెయిన్ హైలెట్స్ ఇవే!

0
-advertisement-

     సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని అడ్డంకులను పూర్తీ చేసుకుని ఈ నెల 11 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసు కుని యు/ఏ సర్టిఫికేట్ ని సొంతం చేసు కోగా సినిమా రన్ టైం 2 గంటల 47 నిమిషాలు ఉందని సమాచారం.

-advertisement-

-advertisement-

ఇక సెన్సార్ నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా కథ మరీ అద్బుతం కాదు కానీ రొటీన్ నేపధ్యంలోనే ఉన్నా పార్ట్ పార్టులుగా డైరెక్టర్ సినిమా ను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరిస్తుందని అంటున్నారు. ముందు మిలటరీ ఎపిసోడ్.

-advertisement-

-advertisement-

-advertisement-

తర్వాత ట్రైన్ ఎపిసోడ్ తర్వాత అల్టిమేట్ ఇంటర్వెల్ బ్యాంగ్, ఇక సెకెండ్ ఆఫ్ హీరో విలన్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్, విజయశాంతి మహేష్ మధ్య ఎమోషనల్ సీన్స్ అలాగే హీరోయిన్ ఫ్యామిలీ తో హీరో కామెడీ సీన్స్… మాస్ సాంగ్స్ ఇలా అన్నీ బాగా సెట్ అయ్యాయట. దాంతో ఓవరాల్ గా ఓ పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉంటుందని అంటున్నారు.

-advertisement-

రీసెంట్ టైం లో సెన్సార్ నుండి అన్ని బిగ్ మూవీస్ కి రేప్సాన్స్ ఇలాగే ఉంటుంది కానీ ఇది పక్కా కమర్షియల్ మూవీ అవ్వడం తో కథ పాయింట్ నిజమనే చెప్పాలి. కానీ ట్రీట్ మెంట్ మాత్రం ఆడియన్స్ ని సెన్సార్ రిపోర్ట్ రేంజ్ లో అలరిస్తే మట్టుకు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో…

సెన్సేషనల్ రికార్డులను సినిమా సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. మొత్తం మీద వారి నుండి ఫైనల్ టాక్ ఏంటి అంటే మాత్రం ఇది మహేష్ నుండి వస్తున్న మరో దూకుడు రేంజ్ మూవీ అని అంటున్నారు. ఇక సంక్రాంతి రేసులో ఆడియన్స్ న సరిలేరు నీకెవ్వరు సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here