Home గాసిప్స్ సరిలేరు నీకెవ్వరు Vs అల వైకుంఠ పురంలో గొడవ కి రీజన్స్ ఇవే??

సరిలేరు నీకెవ్వరు Vs అల వైకుంఠ పురంలో గొడవ కి రీజన్స్ ఇవే??

0

   బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల మధ్య పోటి అనేది కామన్, అందునా సంక్రాంతి అంటే లెక్కకు మించి పోటి ఉంటుంది, రీసెంట్ టైం లో సంక్రాంతి టైం లో 3 నుండి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఎక్కువ శాతం టాక్ బాగుంటే సాలిడ్ కలెక్షన్స్ ని కూడా అందుకున్నాయి. ఈ ఇయర్ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు 2 క్రేజీ మూవీస్ రానున్నాయి. ఒకటి సరిలేరు నీకెవ్వరు మరోటి అల వైకుంఠ పురంలో…

కానీ రెండు సినిమాల మధ్య ఇప్పుడు పోటి తీవ్ర తరం కాగా రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయ్యాయి. దానికి గల కారణాలు ఏంటి అనేవి బయటికి చెప్పక పోయినా ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ విధంగా జరిగింది అని అంటున్నారు.

ముందుగా ఇద్దరు సంక్రాంతి కి తమ సినిమాలు రిలీజ్ చేయాలనీ అని భావించారు. కానీ ముందుగా అల్లుఅర్జున్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి 12 అక్టోబర్ 6 గంటల 37 నిమిషాలకు జనవరి 12 రిలీజ్ పోస్టర్ వదిలాడు. వెంటనే అదే రోజు 8 గంటల 13 నిమిషాలకు మహేష్ తన హ్యాండిల్ నుండి సరిలేరు కూడా జనవరి 12 నే అని పోస్టర్ వదిలాడు. దాంతో అప్పటి నుండి క్లాష్ పీక్స్ కి వెళ్ళింది.

దాంతో ఇండస్ట్రీ పెద్దలు కలిసి ఒక అగ్రిమెంట్ కి వచ్చారట. ఆ అగ్రిమెంట్ ప్రకారం సరిలేరు నీకెవ్వరు ఒక రోజు ముందు వస్తుంది, అల వైకుంఠ పురం లో అదే రోజు వస్తుంది, సరిలేరు నీకెవ్వరు రిలీజ్ రోజు తెలుగు రాష్ట్రాలలో 60% థియేటర్స్ కేటాయించాలని… తర్వాత రోజు 40% వరకు థియేటర్స్ ఉంటాయని…

అలాగే అల వైకుంఠ పురంలో మొదటి రోజు 60% థియేటర్స్ కేటాయించాలని తర్వాత రోజు నుండి రెండు సినిమాలకు మిగిలిన సినిమాలకు పోను మిగిలిన థియేటర్స్ ని చేరి సగం ఇవ్వాలని అగ్రిమెంట్ తో రిలీజ్ డేట్ లను మార్చుకున్నారట. దాంతో రెండు టీమ్స్ పోస్టర్స్ ని మార్చి రిలీజ్ చేసుకున్నాయి.

కానీ రిలీజ్ దగ్గర పడ్డ తర్వాత అల వైకుంఠ పురంలో రెండో రోజు 50% థియేటర్స్ కాకుండా 40% లోపే థియేటర్స్ మిగులుతున్నాయట. గీత ఆర్ట్స్ ఓన్ థియేటర్స్ కాకుండా మిగిలిన థియేటర్స్ అన్ని కలిపినా 40% కూడా ఉండవని టాక్. దాంతో దీని పై అల వైకుంఠ పురంలో టీం సరిలేరు నీకెవ్వరు టీం ని అడిగినా పెద్ద స్పందన రాలేదని టాక్.

దాంతో ఇలా తక్కువ థియేటర్స్ వల్ల రికవరీ కి దెబ్బ పడే అవకాశం ఉండటం తో అల వైకుంఠ పురంలో సరిలేరు నీకెవ్వరు కన్నా ఒక రోజు ముందు రావాలని నిర్ణయం తీసుకున్నారట. దాంతో ఇది కరెక్ట్ కాదని సరిలేరు టీం కి అలాగే అల వైకుంఠ పురంలో టీం కి మధ్య చర్చలు మొదలు అయ్యాయట.

సరిలేరు నీకెవ్వరు బిజినెస్ ఎక్కువ కావడం తో ఎక్కువ థియేటర్స్ కావాలని ఆ టీం. అలా ఎలా చేరి 50% థియేటర్స్ అనుకున్నాం కదా అని అల వైకుంఠ పురంలో టీం మాటా మాటా అనుకోగా…ఇప్పటికీ సమస్య కొలిక్కి రాలేదని సమాచారం. తాజా న్యూస్ ప్రకారం ఇప్పుడు 2 సినిమాలు జనవరి 11 నే రిలీజ్ కానున్నాయి అని అంటున్నారు.

ఇలా జరగడం వల్ల సరిలేరు నీకెవ్వరు కి మొదటి రోజు రికార్డుల విషయం లో దెబ్బ పడుతుంది, అలాగే అల వైకుంఠ పురం లో కి కూడా ఓపెనింగ్స్ దెబ్బ పడుతుంది. కానీ థియేటర్స్ అగ్రిమెంట్స్ సరిగ్గా లేకపోతె ఓపెనింగ్స్ దెబ్బ పడినా అదే డేట్ కి వస్తామని ఆ టీం చెబుతుందట.

ఇలా గొడవ పడటం వలన రెండు సినిమాలకే నష్టం ఖాయం… ఎవరో ఒకరు తగ్గడమో… లేదా 2 సినిమాలకి సమంగా థియేటర్స్ ని పంచడమో లేక… రెండు సినిమాల బిజినెస్ ని బట్టి థియేటర్స్ 55% – 45% పంచడం లాంటివి చేసి చెరో రోజు రిలీజ్ ని పెట్టుకోవడం మంచింది… మరి 2 సినిమాల ఫైనల్ డెసిషన్ ఏం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here