కెరీర్ మొదలు పెట్టడం వరుస హిట్స్ తో మొదలు పెట్టినా తర్వాత వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకుంటూనే వస్తున్న ఆది సాయి కుమార్ లేటెస్ట్ గా సురబితో కలిసి శశి మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు, సాంగ్స్ మంచి హిట్ అవ్వడం తో సినిమాపై ఆడియన్స్ లో మినిమమ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఎంత వరకు అంచనాలను అందు కుని మెప్పించిందో తెలుసు కుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే… యాంగ్రీ యంగ్ మాన్ అయిన ఆది సాయికుమార్ కేర్ ఫ్రీ గా ఉంటూ లైఫ్ ని లీడ్ చేస్తాడు, తనని మార్చాలని ఫ్యామిలీ ట్రై చేసినా మారడు, ఇక తను హీరోయిన్ సురభి చిన్నప్పటి ట్రెండ్స్, తర్వాత ఇద్దరూ ఒకే కాలేజ్ లో చదువుతారు. హీరోయిన్ పక్కన ఉన్నప్పుడల్లా నార్మల్ అయ్యే హీరో తనని తారు మార్చుకుంటాడు… అలాంటి టైం లో అనుకోని పరిస్థితులు…
ఎదురు అవుతాయి, తర్వాత ఎం జరిగింది, ఇద్దరూ కలిశారా లేదా లాంటివి అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… మరోసారి రొటీన్ కథనే ఎంచుకున్నాడు ఆది, సాంగ్స్ బాగున్నా సినిమాలో కంటెంట్ లేదు, కొన్ని సీన్స్ అలా అలా మెరిసినా కానే ఓవరాల్ గా సీన్ బై సీన్ తర్వాత ఏమవుతుంది అన్నది…
ఒకటి రెండు సీన్స్ మినహా అన్ని సీన్స్ ని ఆడియన్స్ యిట్టె చెప్పగలరు, ఇలాంటి రొటీన్ స్టొరీ లో ఆది తన వరకు బాగా నటించాడు, యాంగ్రీ యంగ్ మాన్ గా తాగుడుకి అలవాటు పడ్డ వాడిలా గడ్డంతో తన లుక్స్ పెర్ఫార్మెన్స్ బాగానే మెప్పించాగా సురభి కి రెండు షేడ్స్ ఉన్న పాత్ర దక్కగా రెండు షేడ్స్ కూడా బాగా నటించింది, ఇతర రోల్స్ అందరూ కూడా ఒకే అనిపించుకున్నారు.
సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్, సాంగ్స్ ఆల్ రెడీ సూపర్ హిట్ అవ్వగా అవి తెరపై ఇంకా బాగున్నాయి అనిపించింది, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, సినిమా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే సాదాసీదాగా ఉంటుంది, ఏమాత్రం ఇంప్రెస్ చేయదు, ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
డైరెక్షన్ విషయానికి వస్తే, అది సాదారణ మైన కథని అంతే సాదారణంగా తెరకెక్కించాడు డైరెక్టర్, ఏ దశలో కూడా అబ్బ ఈ సినిమాతో ఆది హిట్ కొట్టబోతున్నాడు అని అనిపించలేదు.. ఫస్టాఫ్ జస్ట్ ఓకే అనిపించగా సెకెండ్ ఆఫ్ బిలో పార్ గా ఉందనిపించింది, రన్ టైం 2 గంటల 11 నిమిషాలే అయినా ఓ పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది…
సాంగ్స్ హిట్ తో జనాలను థియేటర్స్ రప్పించేలా చేసినప్పటికీ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది, ఆది పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ అది కూడా చాలా ఓపిక తో కూర్చుంటేనే… మొత్తం మీద ఆది హిట్ కోసం ఇంకా ఎదురు చూడాల్సిందే అనిపించింది, సినిమా మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్…