లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ ఎంటర్ అయిన తర్వాత సినిమాలు థియేటర్స్ లోకి రావాలి అంటే కొంచం బయపడ్డాయి కానే ఇయర్ ఎండ్ లో వచ్చిన సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో హిట్ అవ్వగా సంక్రాంతి కి వచ్చిన క్రాక్ అండ్ డబ్ మూవీ మాస్టర్ లు సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం తెలుగు మూవీస్ వరుస పెట్టి రిలీజ్ లను కన్ఫాం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
ఇంతలో సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడం తో పరిస్థితి మళ్ళీ మొదటికి రాగా ఇప్పుడు సినిమాలు మళ్ళీ రిలీజ్ అవుతున్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో 50% ఆక్యుపెన్సీ అండ్ టికెట్ హైక్స్ లేక పోవడం తో పెద్ద సినిమాలు ఏవి ధైర్యం చేసి రిలీజ్ అవ్వడం లేదు… ఉన్నంతలో…..
చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి తమ రేంజ్ లో డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో మరికొన్ని వారాల్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రేట్లు 50% ఆక్యుపెన్సీ తో ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి అన్న డౌట్ లో…
ఉన్నారు… దాంతో ఏదైనా ఒక మీడియం రేంజ్ మూవీ రిలీజ్ అయితే కలెక్షన్స్ వస్తే ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేయాలనీ ఎదురు చూస్తున్న టైం లో ఇప్పుడు గోపీచంద్ నటించిన సీటిమార్ సినిమా పై అందరి ఆశలు నెలకొన్నాయి. ఈ సినిమా సెకెండ్ పాండమిక్ తర్వాత భారీ గా రిలీజ్ అవుతున్న సినిమాగా చెప్పుకోవాలి…
అలాగే మాస్ హీరో అయినా గోపీచంద్ ప్రజెంట్ హిట్స్ లో లేకున్నా ఈ సినిమా పై అంచనాలు ఉండటం తో సినిమా ఓపెనింగ్స్ ని బట్టి పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలో లేదో క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నాయి. సీటిమార్ 4-5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సాధిస్తే ఇక పెద్ద సినిమాలు రిలీజ్ లు కన్ఫాం చేసుకోవచ్చు… అందుకే ఇప్పుడు అందరి హోప్స్ సీటిమార్ పై ఉన్నాయి. మరి సీటిమార్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.