లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ తర్వాత ఇండస్ట్రీ తిరిగి తేరుకోవడానికి పెద్దగా టైం ఏమి పట్టలేదు, ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి సినిమాలు ఇయర్ ఎండ్ టైం నుండి థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా సంక్రాంతికి పరిస్థితులు కంప్లీట్ గా నార్మల్ అయినట్లు వరుస పెట్టి వచ్చిన సినిమాల కలెక్షన్స్ సాలిడ్ గా ఉండగా అప్పటి నుండి సమ్మర్ వరకు సినిమాల జాతర కొనసాగింది… కానీ సెకెండ్ వేవ్ ఎంటర్ అయ్యాక…
పరిస్థితులు మారిపోయాయి. సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వక ముందే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించడం, ఇప్పుడు పరిస్థితులు నార్మల్ అయినా ఇంకా 50% ఆక్యుపెన్సీ అలాగే 3 షోల నిభందన వలన పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలి అంటే బయపడుతున్నాయి… దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ చిన్న సినిమాలే..
రిలీజ్ అవుతూ వాటి రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా అందరూ హోప్స్ పెట్టుకున్న గోపీచంద్ సీటిమార్ సినిమా మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా వీకెండ్ లో కూడా నైజాం లో అండర్ పెర్ఫార్మ్ చేయడం తప్పితే సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది…
ఈ సినిమా కలెక్షన్స్ ని చూసి ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక హాప్ వచ్చింది అని చెప్పాలి. టికెట్ రేట్లు నార్మల్ అయితే ఇంకా మంచిది కానీ ఆంధ్రప్రదేశ్ లో 100% ఆక్యుపెన్సీ అలాగే 4 షోలు ఇచ్చినా కానీ కలెక్షన్స్ బాగానే వచ్చే అవకాశం ఉందన్న ఆశలు ఇప్పుడు వరుస పెట్టి సినిమాల రిలీజ్ లకు హెల్ప్ కాబోతుంది.. సీటిమార్ ఇప్పుడు ఇండస్ట్రీకి తిరిగి ఊపిరి పోసింది కానీ…
వర్కింగ్ డేస్ లో డ్రాప్ అవ్వడం, ఆంధ్రాలో పరిస్థితులు ఇంకా సెట్ అవ్వక పోవడం తో కలెక్షన్స్ ఇంకా సెట్ కాక పోవడం తో ఈ సినిమా ఇబ్బంది పడుతుంది కానీ ఈ నెల 24 నుండి 100% ఆక్యుపెన్సీ ఆంధ్రలో ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.. అది జరిగితే ఈ సినిమా ఇచ్చిన ఊపుతో లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.