7 ఏళ్లుగా ఓ మాస్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ తనతో గౌతమ్ నంద సినిమా తీసిన డైరెక్టర్ సంపత్ నంది తో కలిసి చేసిన మరో సినిమా సీటిమార్, తమన్నా తో కలిసి గోపీచంద్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా ఎంత వరకు అంచనాలను అందుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే… బ్యాంక్ ఉద్యోగి కం ఎక్స్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ అయిన హీరో… ఒక ఊరు… ఆ ఊరి నుండి 8 మంది అమ్మాయిలు నేషనల్ కబడ్డీ లీగ్ లో ఆడించి వాళ్ళ సమస్యని సాల్వ్ చేయాలనీ చూసే కోచ్ గా గోపీచంద్ ఉండగా, గోపీచంద్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది….వీళ్ళని అడ్డుకోవడానికి చూసే రావ్ రమేష్…
మరి హీరో తన టీం తో కలిసి అనుకున్నది ఎలా సాధించాడు అన్నది అసలు కథ… కొన్ని సినిమాలు కథ పరంగా చూస్తె అంతగా ఏమి ఉండదు కానీ సీన్ బై సీన్ సినిమాగా చూసినప్పుడు ఆకట్టుకుంది. సీటిమార్ ఆ కోవలోకే వచ్చే సినిమా అని చెప్పాలి. కథగా చెప్పాలి అంటే అంత గొప్ప కథ కాదు కానీ…
ఆ కథని మలచిన తీరు చెప్పిన విధానం, అన్ని వర్గాలను దృష్టి లో పెట్టుకుని రాసుకున్న స్క్రీన్ ప్లే బాగా మెప్పించింది, గోపీచంద్ తన రోల్ లో అద్బుతంగా అంటించాడు, మాస్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ లో ఈజ్ తో ఫుల్ ఫాంలో ఉన్నట్లు డైలాగ్స్ తో దుమ్ము లేపాడు, తమన్నా రోల్ పర్వాలేదు అనిపించగా జ్వాలా రెడ్డి సాంగ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది.
ఇక అమ్మాయిలు అందరూ ఆకట్టుకోగా రావ్ రమేష్ కూడా మెప్పించాడు, మిగిలిన యాక్టర్స్ అందరూ పర్వాలేదు… సంగీతం బాగుంది, బ్యాగ్రౌండ్ మణిశర్మ దుమ్ము లేపాడు. ఎలివేషన్ సీన్స్ కుమ్మేశాడు… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉన్నా ఆకట్టుకుంది… డైలాగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది…
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకోగా… డైరెక్షన్ పరంగా సంపత్ నంది ఈ సారి ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో బాగా చూపెట్టాడు, కబడ్డీ సీన్స్ ను బాగా తీయగా అమ్మాయిలతో ఫైట్ సీన్ ని, గోపీచంద్ యాక్షన్ సీన్స్ పై ప్రత్యెక శ్రద్ధ పెట్టగా ఆ సీన్స్ బాగా వచ్చాయి. ముందే చెప్పినట్లు కథలో అంత బలం లేకున్నా కానీ…
సీన్ బై సీన్ సినిమా మెప్పిస్తుంది, సోషల్ మెసేజ్ చెప్పిన తీరు కూడా మెప్పించాగా సినిమాలో ఓవరాల్ హైలెట్స్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్, కబడ్డీ సీన్స్, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్, తమన్నా జ్వాలా రెడ్డి సాంగ్ లాంటివి చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ముందే చెప్పినట్లు రొటీన్ స్టొరీ అనిపించడం…
కథ ప్రిడిక్ట్ చేసేలా ఉండటం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్, కానీ సినిమాగా చూసుకుంటే థియేటర్స్ కి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కచ్చితంగా ఓ మాస్ కమర్షియల్ మూవీ చూశాం అన్న ఫీలింగ్ తో బయటికి వస్తారు, గోపీచంద్ కి ఇది ఓవరాల్ గా రీసెంట్ టైంలో బెస్ట్ మూవీ అని చెప్పాలి. సినిమాకి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…