Home న్యూస్ సెహరి మూవీ టాక్ ఏంటి…వీకెండ్ కలెక్షన్స్ ఎంత!

సెహరి మూవీ టాక్ ఏంటి…వీకెండ్ కలెక్షన్స్ ఎంత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో చిన్న సినిమా అలాగే చాలా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన సినిమా సెహరి…. చిన్న సినిమానే అయినా కానీ ఉన్నంతలో ఈ సినిమా కి కూడా ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయ్యింది, అసలు సినిమా ఎలా ఉందో ఒకసారి తెలుసుకుంటే… కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని…

పెళ్లి చేసుకోవాలి అనుకున్న హీరో ఆ అమ్మాయి దూరం అవ్వడంతో మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం అవుతాడు, కానీ పెళ్ళికూతురు చెల్లెలు అయిన హీరోయిన్ తన లైఫ్ లోకి ఎంటర్ అవ్వడంతో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, హీరో అసలు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నది సినిమా స్టొరీ….

లైట్ స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా చాలా సింపుల్ గానే ఉన్నప్పటికీ ఎంటర్ టైన్ మెంట్ పరంగా చాలా వరకు ఆకట్టుకుని మెప్పించింది… అందరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా సాంగ్స్ కూడా మెప్పించాయి. లాజిక్స్ లాంటివి ఏమి వెతక్కుండా సింపుల్ కథ తో ఎంటర్ టైన్ చేసి మెప్పించారు…

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ఈ సినిమాతో చాలా వరకు ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది…. మొత్తం మీద ఈ వీకెండ్ మూవీస్ అన్ని చూసి ఈ మూవీని చూడాలా వద్దా అన్న డౌట్ ఉన్న వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళొచ్చు. సినిమా పర్వాలేదు అనిపించేలా ఎంటర్ టైన్ చేస్తుంది… ఇక బాక్స్ ఆఫీస్ వైజ్ చూసుకుంటే సినిమా వీకెండ్ మొత్తం మీద….

తెలుగు రాష్ట్రాలలో 14 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 20 లక్షల దాకా గ్రాస్ ను అందుకుంది. డిజే టిల్లు, ఖిలాడి సినిమాల వలన ఈ సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, దానికి తోడూ థియేటర్స్ కూడా తక్కువే అవ్వడం కూడా ఇంపాక్ట్ చూపింది… మొత్తం మీద సినిమా పర్వాలేదులా ఉంది కాబట్టి లాంగ్ రన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక సినిమా బిజినెస్ 1 కోటి రేంజ్ లో ఉంటుంది ఓవరాల్ గా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here