Home న్యూస్ శాకుంతలం రివ్యూ-రేటింగ్….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

శాకుంతలం రివ్యూ-రేటింగ్….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ అలాంటి విజయం లేని గుణశేఖర్ మధ్యలో రుద్రమదేవితో భారీ విజువల్ వండర్ ని క్రియేట్ చేయాలి అనుకున్నా అది జరగలేదు, తర్వాత హిరణ్యకశిపుడు కోసం 5 ఏళ్ల టైం వెచ్చించినా కోవిడ్ వల్ల సెట్ అవ్వలేదు. ఇలాంటి టైంలో కాళిదాసు ర‌చించిన సంస్కృత నాట‌కం అభిజ్ఞాన శాకుంత‌లంని సినిమాగా మార్చాలని డిసైడ్ అయిన గుణశేఖర్ సమంతని లీడ్ రోల్ లో తీసుకుని చేసిన శాకుంతలం సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

విశ్వామిత్రుని మేనకకు జన్మించిన బిడ్డే శాకుంతల, కానీ నరుడి వల్ల కలిగిన సంతానం అవ్వడంతో దేవలోకంకి ప్రవేశం లేని ఆ బిడ్డని కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర విడిచిపెట్టగా కణ్వ మహర్షి ఆ బిడ్డకి శకుంతల అని పేరు పెట్టగా తను పెరిగి పెద్దది అయిన తర్వాత హస్తినాపుర రాజు దుష్యంతుడు తనని చూసి ఇష్టపడతాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు, అలాగే దగ్గర అవుతారు, తనని 6 నెలలో తన రాజ్యానికి తీసుకు వెళతాను అని చెప్పి వెళతాడు దుష్యంతుడు… ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

ఇలాంటి మైతలాజికల్ స్టొరీలు చదివే టైంలో బాగా ఇంప్రెస్ చేస్తాయి కానీ తెరపై చూసే క్రమంలో పెర్ఫెక్ట్ గా మెప్పించడం చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇదే రిపీట్ అయింది. భారీ స్టార్ కాస్ట్ ఉన్నా, నటీనటుల యాక్టింగ్ బాగున్నా కానీ ఏ సీన్ కూడా ఆడియన్స్ కి అసలు కనెక్ట్ కాలేక పోయింది. ముఖ్యంగా పాత్ర కోసం చాలా కష్టపడ్డ సమంత నటన మెప్పించినా తన వాయిస్ అస్సలు సెట్ అవ్వలేదు, సినిమాకి మేజర్ మైనస్ లో ఇదొకటి, ఇక గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటం, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ బాగా లేక పోవడం, మెలో డ్రామా, సీరియల్స్ ని తలపించే స్క్రీన్ ప్లే, వీక్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్, అలాగే డైరెక్షన్ కూడా సినిమా లో మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

డైరెక్టర్ గా తాను ఎంచుకున్న పాయింట్ మైతలాజికల్ సబ్జెక్ట్ అయినా అందులో ఉన్న ఓవరాల్ పాయింట్ చాలా నార్మల్ గానే ఉండటంతో తెరపై చూస్తున్నప్పుడు కొన్ని విజువల్స్ మెప్పించినా ఓవరాల్ గా కథ అయ్యాక ఇందులో ఏముందని గుణశేఖర్ ఈ సినిమా తీశాడు అనిపిస్తుంది… ఈ జనరేషన్ ఆడియన్స్ కి ఈ మైతలాజికల్ కథ గురించి చెప్పడం కోసమే ఈ సినిమా తీశారు కానీ అది ఆడియన్స్ కి నచ్చేలా చెప్పలేక పోయారు టీం అందరూ… తన రోల్ వరకు సమంత బాగానే నటించినా ముందు చెప్పినట్లు వాయిస్ మైనస్ అయింది… 3D ఎఫెక్ట్స్ 2 సీన్స్ కే పరిమితం అవ్వగా టోటల్  సినిమాను 3D లో ఎందుకు తీశారో వాళ్ళకే తెలియాలి…

ఇక హీరో పర్వాలేదు అనిపించగా ఆ రోల్ కి ఇంకా పేరున్న హీరో అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. సీనియర్ నటులు అందరూ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించారు. ఇక చిన్న రోల్ లో కనిపించిన అల్లు ఆర్హ చాలా బాగా ఇంప్రెస్ చేసింది…. మొత్తం మీద శాకుంతలం సినిమా చూడాలి అంటే చాలా ఓపిక అవసరం, అంత ఓపిక మీకు ఉంటే సినిమా అతి కష్టం మీద ఒక సారి జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here