బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన సినిమాను కేవలం OTT రిలీజ్ కోసమే ప్లాన్ చేస్తూ తెరకెక్కించడం పాండమిక్ తర్వాత సహజంగా జరుగుతున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొద్ది సినిమాలే ఇలా వచ్చినా కూడా హిందీలో ఇప్పటికీ కూడా డిజిటల్ కోసమే సినిమాలు కొన్ని రూపొందుతున్నాయి. ఒకటి మించి ఒకటి OTT లు పోటీ పడుతూ ఉండటంతో సినిమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.
IPL మ్యాచులతో ఫుల్ జోరు చూపించిన జియో సినిమా(Jio Cinema) వాళ్ళు ఇప్పుడు వారం వారం సినిమాలను ఫ్రీగా జనాలను యాప్ లో చూపించబోతుండగా జూన్ 9న షాహిద్ కపూర్(Shahid Kapoor) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బ్లడీ డాడీ(Bloody Daddy) సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు….
ఈ సినిమాను జియో సినిమా కోసమే స్పెషల్ గా రూపొందించగా సినిమా ద్వారా భారీ వ్యూవర్ షిప్ సొంతం అవుతుంది అన్న నమ్మకంలో ఉన్నారు టీం. ఇక ఈ సినిమా కోసం జెర్సీ సినిమాతో ఫ్లాఫ్ అందుకున్నా కానీ భారీ రెమ్యునరేషన్ ని బ్లడీ డాడీ సినిమా కోసం షాహిద్ కపూర్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నా జెర్సీ అట్టర్ ఫ్లాఫ్ తో తిరిగి షాహిద్ కపూర్ స్లో అవ్వగా ఈ సినిమా కోసం ఏకంగా 40 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది తన కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ మనీ అంటున్నారు. ఇక సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.