నాగ చైతన్య అక్కినేని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 4 రోజుల వీకెండ్ లో మంచి వసూళ్లనే సాధించింది. సినిమా టోటల్ గా 17.25 కోట్ల షేర్ ని వసూల్ చేయగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను కూడా పూర్తి చేసుకుంది.
సోమవారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపకున్నా మినిమమ్ కలెక్షన్స్ తో రన్ అయింది…కానీ ఓవరాల్ గా డే ఎండింగ్ కి వచ్చేసరికి కలెక్షన్స్ ని చూసుకుంటే ఫుల్ సాటిస్ ఫాక్షన్ అయితే లేదనే చెప్పాలి. టోటల్ గా రోజు మొత్తం కలిపి 1.05 కోట్ల షేర్ ని అందుకుంది.
దాంతో టోటల్ గా సినిమా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 18.3 కోట్ల వరకు షేర్ ని అందుకున్నట్లు సమాచారం. 24 కోట్ల బిజినెస్ కి 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి మరో 6.7 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది.