Home గాసిప్స్ 11 ఏళ్ల క్రితం రోబో పై ఇప్పుడు కేసు…శంకర్ కి షాక్…కారణం ఇదే!

11 ఏళ్ల క్రితం రోబో పై ఇప్పుడు కేసు…శంకర్ కి షాక్…కారణం ఇదే!

0

ఒక సినిమా రిలీజ్ టైం లో ఆ సినిమా కోసం ఆశగా ఎదురు చూసే వారు ఉంటారు, కొందరు అడ్డుకోవాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ సినిమా రిలీజ్ అయిన 11 ఏళ్ల తర్వాత ఆ సినిమా పై కేసు వేయడం అన్నది చాలా చాలా అరుదుగా జరిగే విషయం అని చెప్పొచ్చు. ప్రస్తుతం సౌత్ లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ పై ఇలాంటి అభియోగం ఇప్పుడు వేశారు ఒక వ్యక్తీ… ఏ సినిమా గురించో తెలుసా…

సౌత్ ఇండియానే కలెక్షన్స్ తో ఒక ఊపు ఊపేసిన రోబో సినిమా గురించి… ఈ సినిమాను శంకర్ 1999 టైం లోనే కమల్ హాసన్ తో అనుకున్నా అప్పటి బడ్జెట్ పరిమితులు అలాగే టెక్నాలజీ కారణంగా ఆపేసి మళ్ళీ 2008 లో మొదలు పెట్టి 2010 లో సినిమా ను ఆడియన్స్ ముందుకు తెచ్చారు.

కాగా సినిమా రిలీజ్ అయిన 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు అరుర్ అనే వ్యక్తీ తను 1996 లో ఒక పత్రికలో రాసిన జిగుబా అనే కథ నుండి దొంగలించి సినిమాగా రూపొందించారు అంటూ ఇప్పుడు కేసు వేశారు… కోర్టు వారు శంకర్ ను దీనిపై స్పందించాడానికి కోర్టుకు రమ్మని పిలవగా…

శంకర్ కోర్టు కి హియరింగ్ టైం లో రాని కారణంగా ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ కూడా చేశారు అని అంటున్నారు. కథని దొంగిలించిన నేరం కింద ఈ వారెంట్ ని ఇష్యూ చేశారని సమాచారం. ఇక్కడ అందరికీ అర్ధం కాని విషయం సినిమా రిలీజ్ టైం లో ఈయన ఎం చేశారు అని, అప్పుడెప్పుడో వచ్చిన సినిమా పై ఇప్పుడు కేసు వేయడం ఏంటి అనేది ప్రశ్న… అలాగే…

ఇన్ని రోజులు ఎందుకని సైలెంట్ గా ఉన్నారు అని ఎదురు ప్రశ్నలు కూడా వచ్చినప్పటికీ ఇన్నాళ్ళు మాట్లాడి సెట్ చేసుకోవాలి అనుకున్నా ఆ అవకాశం డైరెక్టర్ ఇవ్వలేదని అందుకే ఇప్పుడు కోర్టుని ఆశ్రయించాం అంటున్నారని సమాచారం. మరి ఫైనల్ శంకర్ ఈ విషయం పై ఎలా స్పందిస్తారు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here