లాస్ట్ ఇయర్ శతమానం భవతి తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన శర్వానంద్ తర్వాత రాధ సినిమా తో పరాజయాన్ని సొంతం చేసుకోగా కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు మహానుభావుడు తో హిట్ కొట్టి ఇప్పుడు మళ్ళీ పడి పడి లేచే మనసు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మంచి బజ్ నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ ని పరిశీలిస్తే..
నైజాంలో 6.3 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు టోటల్ ఆంధ్రా లో 9 కోట్ల బిజినెస్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ గా రెండు రాష్ట్రాలలో 18.3 కోట్ల బిజినెస్ ని అందుకోగా, కర్ణాటక మరియి రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1 కోటి, ఓవర్సీస్ లో 3.5 కోట్ల బిజినెస్ ని అందుకుంది.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ ఇప్పుడు 22.8 కోట్లు అయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ కి మినిమం 23.5 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది. సినిమా కి పాజిటివ్ టాక్ వస్తే ఈ మార్క్ ని అందుకోవడం అంత కష్టం కాదనే చెప్పాలి. మరి ఎం జరుగుతుందో చూడాలి.