Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ రీమేక్…ఇక్కడ కూడా వేసుకుంటున్నారుగా!!

ఇండస్ట్రీ హిట్ రీమేక్…ఇక్కడ కూడా వేసుకుంటున్నారుగా!!

0

రీసెంట్ టైంలో ఒరిజినల్ తో పోల్చితే రీమేక్ సినిమాలను జనాలు అస్సలు ఆదరించడం లేదు… ఒరిజినల్ తో రీమేక్ లను పోల్చి చూస్తూ రీమేక్ మెప్పించక పోతే ఆ సినిమాను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం రీసెంట్ టైంలో చాలా సినిమాల విషయంలో జరిగింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో సినిమా హిందీ రీమేక్ గా తెరకెక్కిన….

షెహజాదా సినిమా ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వగా సినిమా అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యి ఫ్లాఫ్ గా నిలిచింది. ఒరిజినల్ తో పోల్చితే అసలు దరిదాపుల్లోకి కూడా సినిమా లేదని రిలీజ్ టైంలో భారీగానే ట్రోల్స్ ని ఫేస్ చేసింది ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ రన్ ని త్వరగానే పూర్తీ చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి కొంత టైం తీసుకున్న షెహజాదా సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సినిమా కి ఒరిజినల్ తో కంపేర్ చేసి…

మరోసారి ఇదేం రీమేక్ రా బాబు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అల వైకుంఠ పురంలో ఉన్న ఒరిజినాలిటీ షెహజాదాలో లేదని, సీన్ టు సీన్ కాపీ పేస్ట్ లా తీసి మెప్పించలేదని అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద రిలీజ్ అయినప్పుడు ట్రోల్ అయిన సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా మరోసారి ట్రోల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here