కొత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి మరింత టైం తీసుకుంటూ ఉండటం తో పాత సినిమాలనే ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు థియేటర్ ఓనర్లు…. ఈ క్రమం లో తెలుగు లో రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా శక్తి… ఈ ఇయర్ స్టార్టింగ్ లో సినిమాను థియేటర్స్ లో సమ్మర్ కానుకగా ముందే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ కరోనా వలన అది కుదరక లేదు… మార్చి 20 న రిలీజ్ అనుకున్నా థియేటర్స్ మూత పడటంతో…
తర్వాత సినిమా వెంటనే డైరెక్ట్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకుంది, తర్వాత టాక్ బాగా రావడం తో సినిమాను బాగానే చూశారు ఆడియన్స్, తర్వాత సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానెల్ మంచి రేటు చెల్లించి దక్కించుకుని సినిమాను టెలికాస్ట్ చేయగా…
సినిమాకి టెలికాస్ట్ చేసినప్పుడు మంచి రేటింగ్ దక్కింది. ఇలా అటు డైరెక్ట్ రిలీజ్ ను ఇటు టెలివిజన్ ఆడియన్స్ ను కూడా కవర్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు థియేటర్స్ కి జనాలను రప్పించడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 40 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు.
కానీ రెస్పాన్స్ చాలా పూర్ గా ఉందని చెప్పాలి. సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజుకి గాను 30 వేల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసిందని సమాచారం. కనీసం థియేటర్స్ రెంట్ ని కూడా తేలేక పోయింది ఈ సినిమా.. సినిమా టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం జనాలు థియేటర్స్ కి రాక పోవడం తో ఇంపాక్ట్ గట్టిగానే కనిపిస్తుంది.
అందునా సినిమా ఆల్ రెడీ చూసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అది కూడా ఇంపాక్ట్ చూపింది. ఎలాగు పెర్సేంటేజ్ బేస్ మీద సినిమా రిలీజ్ అవ్వడంతో ఎవ్వరికీ పెద్దగా నష్టాలు ఉండవనే చెప్పాలి. కానీ జనాలను తిరిగి థియేటర్స్ రప్పించే రేంజ్ బొమ్మ పడితే తప్ప ఇప్పుడు థియేటర్స్ వైపు జనాలు చూసేలా లేరని క్లియర్ అవుతుంది.