Home న్యూస్ సల్మాన్ సికందర్ మూవీ టాక్ ఏంటి…..హిట్టా-ఫట్టా!!

సల్మాన్ సికందర్ మూవీ టాక్ ఏంటి…..హిట్టా-ఫట్టా!!

0

చాలా కాలంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న స్టార్స్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) కూడా ఒకరు కాగా లేటెస్ట్ గా ఏ ఆర్ మురగదాస్ డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ సికందర్(Sikandar Movie) తో ఈ రంజాన్ కానుకగా సినిమాను భారీ లెవల్ లో రిలీజ్ చేయగా సినిమా మీద డీసెంట్ హైప్ ఉండగా…

సినిమా ఆ హైప్ ను అందుకుందా లేదా అంటే మాత్రం పెద్దగా అందుకోలేక పోయింది అనే చెప్పాలి…కథ పాయింట్ కి రాజ్ కోట్ వంశానికి చెందిన హీరో తన వైఫ్ రష్మిక తో హ్యాప్పీ గా ఉండగా అనుకోకుండా తన భార్య చనిపోతుంది… చనిపోయే టైంలో..

తన కోరిక మేరకి ముగ్గురికి అవయవ దానం చేస్తుంది. కానీ ఆ ముగ్గురికి ప్రాణహాని ఉందని తెలుసుకున్న హీరో ఏం చేశాడు అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సికందర్ మూవీ ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే స్టోరీ లైన్ తో తెరకేక్కినా కూడా ఏ ఆర్ మురగదాస్ ఫామ్ లో లేక పోవడంతో…

స్క్రీన్ ప్లే పరంగా ఒకప్పటి తన మ్యాజిక్ అయితే స్క్రీన్ పై కనిపించలేదు అనే చెప్పాలి….సౌత్ లో వచ్చిన అనేక సినిమాలను మిక్సీ లో వేసి తీసినట్లు అనిపించినా సికందర్ కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు అనిపించినా కూడా చాలా ఫ్లాట్ నరేషన్ తో సాగిన సినిమాలో…

బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించక పోవడంతో ఒక దశ దాటాక మరీ ప్రిడిక్టబుల్ గా బోర్ గా అనిపించింది సినిమా…సల్మాన్ ఖాన్ కొన్ని సీన్స్ వరకు ఎనర్జీగా అనిపించినా కూడా చాలా వరకు మాత్రం మునుపటి ఫామ్ ను చూపించలేక పోయాడు…

ఓవరాల్ గా ఒకప్పటి మురగదాస్ సినిమాలను సల్మాన్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని చూస్తె మట్టుకు పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపించ లేదు అనే చెప్పాలి. కానీ ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా కొంచం ఓపికతో  చూస్తె మాత్రం ఒక సారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది సినిమా… కానీ సల్మాన్ మురగదాస్ ల కాంబోలో ఎక్స్ పెర్ట్ చేసిన సినిమా అయితే కాదు ఈ సికందర్ మూవీ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here