బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు లో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ ని ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం. ముందుగా రిలీజ్ కి ముందు రోజు వేసిన స్పెషల్ షోల ద్వారా ఆల్ మోస్ట్….
30 లక్షలకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అద్బుతమైన ఆక్యుపెన్సీతో రన్ అయింది. ఇక సినిమా రిలీజ్ రోజున తెలుగు రాష్ట్రాల్లో క్లాస్ సెంటర్స్ లో డీసెంట్ గా హోల్డ్ చేయగా మాస్ సెంటర్స్ లో మాత్రం స్లో గానే ఉంది… మొత్తం మీద సినిమా…
ఇప్పుడు మొదటి రోజు ఓవరాల్ గా 35% రేంజ్ లో ఆక్యుపెన్సీని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ ప్రీ సేల్స్ ద్వారా 1.35 కోట్ల మార్క్ ని అందుకోగా రిలీజ్ రోజున సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 1.50-1.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది….
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు, ఇక తమిళనాడులో సినిమా 7-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. ఓవరాల్ గా సీరియస్ స్టొరీ తో వచ్చిన సినిమాతో బాక్స్ ఆఫీస్ ను బాగానే ధనుష్ షేక్ చేశాడు. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.