ఒక సినిమా ఒకరితో అనుకుని మరొకరితో తీయడం అన్నది సహజంగా అన్ని ఇండస్ట్రీలలో జరుగుతూ ఉంటుంది. కానీ అవి పైకి చెబితే తప్పితే చాలా వరకు బయటికి తెలియవు, రీసెంట్ గా బాలయ్య వీర సింహా రెడ్డి డైరెక్టర్ తో ముందే క్రాక్ సినిమా చేయాల్సింది కానీ కొన్ని కారణాల వలన అది మిస్ అవ్వగా ఇప్పుడు ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో బ్లాక్ బస్టర్…
హిట్ గా నిలిచి దుమ్ము లేపగా ఈ సినిమా ని కూడా ఒక హీరో మిస్ చేసుకున్నాడు. ఆ హీరో ప్లేస్ లో తరువాత ధనుష్ రావడం, తెలుగు లో ఇప్పుడు ఈ సినిమా ధనుష్ కి బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం జరిగి తన మార్కెట్ ఇక్కడ ఎక్స్ పాండ్ అయింది..
ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని అంటున్నారు ఇండస్ట్రీలో… ముందుగా వెంకీ అట్లూరి Mr మజ్ను సినిమా తర్వాత ఈ సినిమా కథని నానికే వినిపించాడట, కానీ తన కమిట్ మెంట్స్ వల్లనో లేక కథలో ఏమైనా లోపం అనుకున్నాడో కానీ…
నాని ఈ కథకి నో చెప్పాడట, తర్వాత అనుకోకుండా ధనుష్ కి ఈ కథ వినిపించడం, ధనుష్ కి కథ నచ్చడం, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతాలను సృష్టిస్తూ ఉండటం విశేషం, మొత్తం మీద నాని ఓ బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకోగా ధనుష్ కి తెలుగు లో ఈ సినిమా అద్బుతమైన లాంచ్ ప్యాడ్ లా మారిందని చెప్పొచ్చు.