Home గాసిప్స్ స్కంద మూవీ బడ్జెట్ అన్ని కోట్లా….నిర్మాతకి లాభమా నష్టమా!!

స్కంద మూవీ బడ్జెట్ అన్ని కోట్లా….నిర్మాతకి లాభమా నష్టమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మంచి హైప్ నడుమ లాంగ్ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ ని సాధించినా…

తర్వాత కొంచం స్లో డౌన్ అయిన ఈ సినిమా రెండో వారంలో అడుగు పెట్టగా హిట్ కోసం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా, సినిమా బడ్జెట్ లెక్కలు ఇప్పుడు ఆల్ మోస్ట్ రివీల్ అవ్వగా ఆ లెక్కల ప్రకారం రామ్ కెరీర్ లోనే..

ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారట, ఆల్ మోస్ట్ 80 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిందట. ఇక సినిమా థియేట్రికల్ వాల్యూ 46 కోట్లకు పైగా ఉండగా ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి ఈ సినిమా కి…

SKANDA 2 Days Total WW Collections!!

85 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో సౌత్ టోటల్ అన్ని భాషల డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కలిపి 54 కోట్ల దాకా ఉండగా హిందీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ అలాగే మ్యూజిక్ రైట్స్ కలిపి మరో 30 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు సమాచారం.

దాంతో సినిమాకి టోటల్ గా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 130 కోట్లకు పైగానే బిజినెస్ జరగగా అందులో ఓన్ రిలీజ్ బిజినెస్ ను అలాగే పబ్లిసిటీ ఖర్చులను పక్కకు పెట్టినా పెట్టిన బడ్జెట్ మీద నిర్మాతకి అవలీలగా 10 కోట్ల రేంజ్ లో లాభం ఉండే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here