Home న్యూస్ స్కంద ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!

స్కంద ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకోగా అక్కడ నుండి…

ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది… పూర్తి స్టోరీని ఏమి రివీల్ చేయకున్నా కూడా ఫ్యామిలీతో ఉండే హీరో లైఫ్ లో పొలిటికల్ నేపధ్యంలో వచ్చిన ఇబ్బందుల తర్వాత లైఫ్ ఎలా టర్న్ అయింది. ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా స్టోరీగా చెబుతున్నారు…

సినిమా కథ పాయింట్ చాలా రొటీన్ గా ఉంటుందని, రెగ్యులర్ బోయపాటి సినిమాల మాదిరిగానే ఈ కథ ఉంటుందని అంటున్నారు, అక్కడక్కడా ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఊరమాస్ ఫైట్స్ అండ్ ఒక ట్విస్ట్ సినిమాలో మేజర్ హైలెట్స్ అని కానీ రెగ్యులర్ రొటీన్ స్టోరీ పాయింట్….

వీక్ సాంగ్స్ సినిమాకి కొంచం మైనస్ లా అనిపించినా కూడా సినిమాలో ఉన్న ఫ్యామిలీ ఎలిమెంట్స్, మాస్ మూమెంట్స్ రెగ్యులర్ మూవీ లవర్స్ కి నచ్చే అవకాశం ఉన్నప్పటికీ మరీ కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి మాత్రం కొంచం నచ్చే అవకాశం తక్కువే అని అంటున్నారు.

ఓవర్సీస్ ఆడియన్స్ ఎక్కువగా క్లాస్ మూవీస్ ని ఇష్టపడతారు…అలాగే బోయపాటి మూవీస్ లో కొన్నింటికి మాత్రమే యునానిమస్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్కంద మూవీ పక్కా మాస్ మూవీ అవ్వడంతో ఇలాంటి టాక్ అక్కడ నుండి రావడం కామన్ లానే అనిపిస్తూ ఉండగా సినిమాకి…

అక్కడ ఫైనల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ కి మధ్యలో టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ రెగ్యులర్ షోలకు సినిమా నుండి కొంచం బెటర్ టాక్ వచ్చే అవకాశం ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ మాత్రం కుమ్మేయవచ్చు.

ఓవరాల్ గా స్కంద మూవీ కి… ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పూర్తి అయ్యే టైంకి పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ సొంతం అయింది. బోయపాటి సినిమాలకు మినిమమ్ ఈ రేంజ్ టాక్ వచ్చినా మాస్ లో మంచి జోరు చూపించవచ్చు…ఇక రెగ్యులర్ షోలకు స్కందకి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here