Home న్యూస్ 110 కోట్ల వసూళ్ళు….అందులో ఇన్ని కోట్లు ఫేక్ ఏంటి సామి!!

110 కోట్ల వసూళ్ళు….అందులో ఇన్ని కోట్లు ఫేక్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) ఈ ఇయర్ రిపబ్లిక్ డే వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు స్కై ఫోర్స్(SKY Force) సినిమాతో రాగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా..

రీసెంట్ టైంలో ఓపెన్ గా ఒక సినిమా టికెట్స్ ను ఫ్రీగా అనేక ఆఫర్స్ తో పంచి పెట్టడం ఏ ఏ సినిమాకే చెల్లింది అన్న అపవాదు ఓ రేంజ్ లో స్ప్రెడ్ అయింది…మొదటి వీకెండ్ లోనే అనేక ఆఫర్స్ తో సినిమా టికెట్ సేల్స్ ను పెంచారని ఆరోపణ ఉంది..

బాలీవుడ్ లో రెండేళ్ళుగా కార్పోరేట్ బుకింగ్స్ సినిమా సినిమా కి పెరిగి పోతూ ఉండగా ఈ సినిమా విషయంలో అది ఓపెన్ గా జరిగింది అని చెప్పాలి. ఎంత చేసినా సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు 110 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అయితే అందుకుంది కానీ…

అందులో ఓవరాల్ గా కార్పోరేట్ బుకింగ్స్ ను, ఆఫర్స్ ను పక్కకు పెడితే ఓవరాల్ గా సినిమా కి 45-50 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ వచ్చాయి అంటూ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఓపెన్ గా నే చెబుతున్నారు… ఈ సినిమా నిర్మాతలు స్త్రీ2 మూవీ తో ఊహకందని రేంజ్ లో…

లాభాలను సొంతం చేసుకోవడంతో తమ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎలాగైనా హిట్ అనిపించుకోవడానికి ఫ్లాఫ్స్ లో ఉన్న అక్షయ్ కుమార్ కి కంబ్యాక్ ఇవ్వాలని ఇలా భారీ లెవల్ లో ఓపెన్ గానే కార్పోరేట్ బుకింగ్స్ చేశారని అంటున్నారు… 

ఏది ఏమైనా సినిమా 110 కోట్ల మార్క్ ని దాటి బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ కి కంబ్యాక్ మూవీ లా అనిపించినా కూడా, నికార్సయిన కంబ్యాక్ అయితే కాదనే అంటున్నారు అందరూ కూడా…ఈ కార్పోరేట్ బుకింగ్స్ ట్రెండ్ ఇలానే కొనసాగితే ఫ్యూచర్ లో జనాలు చూడకపోయినా కోట్లకు కోట్లు వచ్చినట్లు పోస్టర్స్ అయితే వస్తూనే ఉంటాయి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here