Home టోటల్ కలెక్షన్స్ ఎపిక్ ఫ్లాఫ్స్ కి బ్రేక్…అక్షయ్ కుమార్ “స్కై ఫోర్స్” టోటల్ కలెక్షన్స్…కానీ!!

ఎపిక్ ఫ్లాఫ్స్ కి బ్రేక్…అక్షయ్ కుమార్ “స్కై ఫోర్స్” టోటల్ కలెక్షన్స్…కానీ!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో ఎక్స్ లెంట్ ఫామ్ తో మాస్ రచ్చ చేసిన బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) తర్వాత టైంలో వరుస ఫ్లాఫ్స్ తో సినిమా సినిమా కి తన రేంజ్ ని తగ్గించుకోగా…ప్రతీ సినిమా రిలీజ్ అవ్వడం, ఆ సినిమా ఆడియన్స్ ను అలరించ లేక విఫలం అవుతూ రావడంతో…

కెరీర్ లోనే లోవేస్ట్ స్టేజ్ లో ఉన్న టైంలో ఈ ఇయర్ రిపబ్లిక్ డే వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు స్కై ఫోర్స్(SKY Force) సినిమాతో వచ్చిన అక్షయ్ కుమార్ కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా సినిమా…

మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని ఉన్నంతలో లాంగ్ లో ఎలాగోలా వాల్యూ బ్రేక్ ఈవెన్ ను దాటేసి అక్షయ్ కుమార్ కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో కంబ్యాక్ మూవీ గా నిలిచింది. టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో 131 కోట్ల రేంజ్ లో…

నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది….ఇండియా గ్రాస్ 155 కోట్ల దాకా ఉండగా…వరల్డ్ వైడ్ గా సినిమా టోటల్ గా 168 కోట్ల రేంజ్ లో వసూళ్ళతో పరుగును పూర్తి చేసుకుని అక్షయ్ కుమార్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచింది.

కానీ ఈ సినిమా టికెట్ సేల్స్ పరంగా సాలిడ్ ట్రోల్స్ ని ఫేస్ చేసుకుంది. ఆల్ మోస్ట్ వచ్చిన కలెక్షన్స్ లో 45% రేంజ్ వసూళ్ళు కార్పోరేట్ బుకింగ్స్ ద్వారానే వచ్చాయి అన్న అపవాదు ఉండగా…ఏవి ఎలా ఉన్నా కూడా ఓవరాల్ గా మాత్రం అక్షయ్ కుమార్ కి ఒక డీసెంట్ రిజల్ట్ ను అయితే ఈ సినిమా ఇచ్చింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here