Home గాసిప్స్ చిన్న సినిమా అన్నారు…4.5 కోట్లు అయ్యిందక్కడా!!

చిన్న సినిమా అన్నారు…4.5 కోట్లు అయ్యిందక్కడా!!

0

     టాలీవుడ్ లో చిన్న సినిమా అంటే కోటి కోటిన్నర రేంజ్ లో నిర్మాణం అయ్యే సినిమాలను చిన్న సినిమాలుగా పరిగణ లో కి తీసుకుంటూ ఉంటారు, రీసెంట్ గా కొన్ని సినిమాలు బడ్జెట్ బాగానే ఇంప్రూవ్ అయ్యి మంచి క్వాలిటీ తో వస్తున్న నేపధ్యం లో ఆ సినిమా ల బడ్జెట్ కూడా కొంచం ఎక్కువగా ఉంటుంది, ఈ సమ్మర్ రేసులో ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలలో యాంకర్ ప్రదీప్ నటించిన…

30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?? అనే సినిమా కూడా ఒకటి, ఈ సినిమా దాదాపు మూడేళ్ళు గా తెరకేక్కుతుందని టాక్ ఉంది, దాంతో చిన్న సినిమా నే తక్కువ బడ్జెట్ లోనే రూపొందుతుంది అనుకున్న ఈ సినిమా బడ్జెట్ పెరిగి పెరిగి భారీగానే అయింది.

ముందుగా కోటి రేంజ్ లో అనుకున్న ఈ సినిమా బడ్జెట్ మొత్తం మీద మూడేళ్ళు తెరకెక్కే సరికి టోటల్ గా 3.2 కోట్ల దాకా చేరిందట. ఇక సినిమా రిలీజ్ కి ముందు చేసిన భారీ పబ్లిసిటీ ఖర్చులు మొత్తం మీద కోటి రేంజ్ లో ఉన్నాయని సమాచారం. ఇక ఈ సినిమా ఫైనాన్స్ అప్పులు కలిపి లెక్క….

మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ లో అయిందని అంటున్నారు, అవడానికి చిన్న సినిమానే అయినా ఏకంగా అన్ని కలుపుకు బడ్జెట్ 4.5 కోట్ల రేంజ్ లో అవ్వగా సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ సెన్సేషనల్ హిట్ తో మంచి బజ్ ఈ సినిమా కి దక్కగా… లాక్ డౌన్ వలన పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ను ఇప్పుడు..

డైరెక్ట్ గా స్ట్రీమింగ్ యాప్స్ లో టెలికాస్ట్ చేయడానికి కొన్ని యాప్స్ 2 నుండి 2.5 కోట్ల రేంజ్ ఆఫర్స్ ఇస్తున్నాయట.. యూనిట్ అయితే ప్రస్తుతానికి నో చెబుతున్నట్లు తెలుస్తుంది, లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ప్రేక్షకుల ముందుకు వచ్చే మొదటి సినిమా ఇదే అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here