Home టోటల్ కలెక్షన్స్ భాగీ 3 కలెక్షన్స్: 150 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది!!

భాగీ 3 కలెక్షన్స్: 150 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది!!

1407
0

     లాక్ డౌన్ వలన మన సినిమాలు ఎలా ఇబ్బంది పడ్డాయో ఇండియా లో మిగిలిన ఇండస్ట్రీ ల సినిమా లు కూడా అదే విధంగా ఇబ్బంది పడ్డాయి. బాలీవుడ్ లో అయితే లాక్ డౌన్ ముందు రోజు రిలీజ్ అయిన సినిమాలు కూడా అర్ధాంతరంగా ఆగిపోయి తర్వాత స్ట్రీమింగ్ యాప్స్ కి వచ్చేశాయి. మార్చ్ లో బాలీవుడ్ బిగ్ మూవీ అయిన టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ సినిమా కూడా దెబ్బతింది.

సౌత్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా నాగ చైతన్య – సునీల్ నటించిన తడాఖా మూవీ రీమేక్… మార్చి లో భారీ క్రేజ్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా లో 80 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా 150 కోట్ల నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో….

బాక్స్ ఆఫీస్ బరిలో దిగగా మొత్తం మీద మొదటి 10 రోజుల్లో 97 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా మౌత్ టాక్ చాలా వీక్ గా ఉన్నా మంచి కలెక్షన్స్ నే సాధించింది. మరి కొన్ని రోజులు ఇలానే ఉంటే సినిమా ఇక బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవ్వడం ఖాయమని…

అంతా భావించారు కానీ అప్పటికే లాక్ డౌన్ ఎఫెక్ట్ పడటం తో సినిమా పరుగును అప్పటికే ముగించాల్సి వచ్చింది. బాలీవుడ్ ట్రెండ్ లో ఈ సినిమా బిజినెస్ ని ఓ 20 కోట్ల మేర లాక్ డౌన్ వలన తగ్గించారు అన్న టాక్ ఉంది కానీ అది అఫీషియల్ అయితే కాదనే చెప్పాలి.

ఒకవేళ అది నిజం అయితే బాక్స్ ఆఫీస్ టార్గెట్ 110 కోట్ల రేంజ్ లో ఉంటుంది, అప్పుడు లాస్ట్ 13 కోట్ల రేంజ్ లో ఉంటుందని చెప్పాలి. లేకుంటే 150 కోట్ల టార్గెట్ కి 97 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఓవరాల్ గా 53 కోట్ల నెట్ కలెక్షన్స్ లాస్ ని సొంతం చేసుకుంది, ఇక లాక్ డౌన్ తర్వాత రీ రిలీజ్ చాన్స్ లేదు కాబట్టి సినిమా లాస్ తోనే పరుగును కంప్లీట్ చేసిందని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here