జబర్దస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ వెండితెరపై చిన్నా చితకా రోల్స్ చేసినా మెయిన్ లీడ్ లో సోలో గా చేసిన సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తో హీరో గా ఆడియన్స్ ముందుకు ఆశీర్వాదం కోసం వచ్చిన సుధీర్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు, సినిమా ఎలా ఉంది అన్న విషయాలను తెలుసుకుందాం పదండీ..
ముందుగా కథ పాయింట్ కి వస్తే మంత్రి దగ్గర పనిచేసే హీరో ఫాదర్ హెల్ప్ తో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ సొంతం చేసుకున్న అమాయకు హీరో సుధీర్ ని ఏ అమ్మాయ్ ఇష్టపడదు. కానీ ధన్య బాలకృష్ణ తనని ఇష్టపడుతుంది, ఇరు కుటుంబాలు ఒప్పుకోగా ఒక సమస్య వస్తుంది.
దాంతో ఒక స్వామి దగ్గరకు వెళ్ళగా అనుకోకుండా ఒక పెద్ద స్కాం లో తన ప్రమేయం లేక పోయినా ఇరుక్కుంటాడు హీరో… మరి ఆ స్కాం ఏంటి, హీరో ఎలా ఇరుక్కున్నాడు, ఎలా బయట పడ్డాడు, దాని వెనక ఎవరు ఉన్నారు లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుధీర్ జబర్దస్త్ అంత ఎనర్జీ కాకున్నా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే విధంగా నటించి మెప్పిస్తాడు, డాన్సులు బాగా చేశాడు.. ఫైట్స్ మాత్రం పెద్ద హీరోల రేంజ్ లో భారీ లెవల్ లో చేయడం కొంచం ఓవర్ అనిపిస్తుంది.
మొత్తం మీద సుధీర్ ఆకట్టుకోగా ధన్య బాలకృష్ణ కూడా అటు గ్లామర్ తో ఇటు నటనతో మెప్పిస్తుంది, క్లైమాక్స్ లో తన పాత్ర షేర్స్ ఆడియన్స్ ని కొంచం షాక్ కి గురి చేస్తుంది, ఇక మిగిలిన నటీనటులు ఉన్నంతలో తమ వరకు నటించి మెప్పించారు.
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనిపించే విధంగా సాగగా సెకెండ్ ఆఫ్ ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది. సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే… సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపించగా ప్రొడక్షన్ వాల్యూస్ కొంచం వీక్ గా ఉంటాయి.
డైరెక్షన్ పరంగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల… ఒక్క సినిమాలో 3 – 4 జానర్స్ ని కలిపి కలగూరగంప చేశాడు, కామెడీ, ఫాంటసీ, థ్రిల్లర్ అండ్ మెసేజ్ జానర్స్ తో కలగలిపిన సినిమా ఇది.. దాంతో ఏది సరిగ్గా పండక కూర సరిగ్గా సెట్ కాలేక పోయింది… ఉన్నంతలో సుధీర్ కి పర్వాలేదు అనిపిచంచే లాంచింగ్ లా అనిపించినా…
ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ మనసును పూర్తిగా గెలుచుకోదు, అలా అని పూర్తిగా నిరాశ కూడా పరచదు. జబర్దస్త్ లాంటి కామెడీలు సుధీర్ నుండి ఎక్స్ పెర్ట్ చేస్తే కొద్దిగా నిరాశనే మిగిలిస్తుంది. జస్ట్ సుధీర్ ని హీరో గా చూడాలి అనుకున్న వాళ్ళు థియేటర్స్ కి వెళ్లి…
సినిమా ని చూసి కొద్ది వరకు ఎంజాయ్ చేయోచ్చు. మొత్తం మీద సినిమా ఒకసారి చూసేలా అనిపిస్తుంది… ఇక హిట్టా ఫట్టా అనేది ఆడియన్స్ నిర్ణయం మీద ఉంటుంది. ఓవరాల్ గా హీరో గా ఫస్ట్ సినిమాతో పర్వాలేదు అనిపించేలా లాంచ్ అయిన సుధీర్ ఫ్యూచర్ లో మంచి ప్రొడక్షన్ టీం లో పడితే మరింత రాటుదేలే అవకాశం ఎంతైనా ఉంది..