Home న్యూస్ “భీష్మ” రివ్యూ…బ్లాక్ బస్టర్ కొట్టిన నితిన్!!

“భీష్మ” రివ్యూ…బ్లాక్ బస్టర్ కొట్టిన నితిన్!!

0

          అ.ఆ తర్వాత వరుసగా లై, చల్ మోహన్ రంగ మరియు శ్రీనివాస కళ్యాణం లాంటి హాట్రిక్ ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకున్న నితిన్ కెరీర్ లో చాలా స్లో అయినా టైం లో కూడా ఛలో డైరెక్టర్ వెంకీ కొడుముల డైరెక్షన్ లో చేసిన భీష్మ తో సాలిడ్ బిజినెస్ సాధించినా సినిమా ప్రీమియర్ షోలతో మంచి టాక్ ని సొంతం చేసుకుంది, ఇక రెగ్యులర్ షోల తర్వాత సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ విషయానికి వస్తే… ఖాళీ గా తిరిగే హీరో పోలిస్ అయిన సంపత్ రాజ్ దగ్గర పని చేస్తూ తన కూతురు అయిన హీరోయిన్ కి లైన్ వేస్తూ ఉంటాడు, తర్వాత హీరో ఫాదర్ గురించి తెలిసిన సంపత్ కి హీరో కి గొడవ జరగా… తర్వాత హీరో గురించి ఒక షాకింగ్ నిజం చెబుతాడు హీరో ఫాదర్ నరేష్..

తర్వాత ఏం జరిగింది… హీరో గురించిన సీక్రెట్ నిజమా కాదా… ఇలాంటివి అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ తన కెరీర్ లో ఏ సినిమా లో కూడా లేనంత ఎనర్జీ గా ఈ సినిమా లో దుమ్ము లేపాడు.

తన కామిక్ టైమింగ్ కానీ యాక్షన్ సీన్స్ లో హీరోయిజం కానీ మీమ్స్ జోక్స్ లో ఈజ్ కానీ అన్నీ అదుర్స్ అనిపించాయి. ఇక రష్మిక కూడా అటు క్యూట్ లుక్స్ తో ఇటు కొంచం పెర్ఫార్మెన్స్ తో మెప్పించాగా ఇద్దరు పెయిర్ కూడా ఆకట్టుకుంది.

ఇక మిగిలిన రోల్స్ లో నటించిన వాళ్ళలో వెన్నెల కిషోర్ కామెడీ కుమ్మేయగా కొన్ని కాంబినేషన్ కామెడి సీన్స్ మరో లెవల్ లో ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. అవే సినిమాకి ఆయువు పట్టు. ఇక సంగీతం పరంగా 2 పాటలు బాగుండగా మిగిలిన పాటలు పర్వాలేదు అనిపిస్తాయి.

బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది, ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల స్లో అయినా చాలా వరకు అంచనాలను అందుకుంటూ సాగింది, ఇక సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా రిచ్ గా ఉండటం విశేషం. ఇక డైరెక్షన్ పరంగా వెంకీ….

తన మొదటి సినిమా కి ఏమాత్రం తీసిపోని ఎంటర్ టైనర్ ని ఇచ్చాడు, కొన్ని సార్లు అయితే ఛలో ని కూడా మించే కామెడీ సీన్స్ థియేటర్స్ నవ్వులతో ఫుల్ జోరు తెప్పించాయి. స్టొరీ పకడ్బందీగా లేకున్నా కేవలం ఎంటర్ టైన్ మెంట్ తో సినిమా ను ఎలా నడపాలో వెంకీ చేసి చూపించాడు.

ఇక ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… కామెడీ సీన్స్, నితిన్ కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్, డైరెక్షన్, మీమ్స్ సీన్స్, హిలేరియస్ ఫస్ట్ ఆఫ్, లాంటివి మేజర్ హైలెట్స్ గా చెప్పుకోవాలి.. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…

స్టొరీ యిట్టె చెప్పేలా ఉండటం, రొటీన్ క్లైమాక్స్ మాత్రమె చిన్న మైనస్ పాయింట్స్, అవి కూడా ఆడియన్స్ ఎంటర్ టైన్ మెంట్ తో ఎంజాయ్ చేయడం తో అస్సలు పట్టించుకోరు. ఓవరాల్ గా రీసెంట్ టైం లో వన్ ఆఫ్ బెస్ట్ ఎంటర్ టైనర్స్ లో భీష్మ సినిమా ఒకటిగా చెప్పుకోవచ్చు.

సినిమా ఇటు ఫ్యాన్స్ ని, కామన్ ఆడియన్స్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని యూత్ ని అన్ని వర్గాలను ఆకట్టుకునే అవకాశం పుష్కలంగా ఉంది, సినిమా కి ఫైనల్ గా మా రేటింగ్ [3 స్టార్స్]…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో సినిమా ఎంతవరకు జోరు చూపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here