ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun) సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా హిందీలో మొదటి రోజు నుండే డబ్బింగ్ సినిమాల రికార్డులనే కాదు ఏకంగా బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ మాస్ సంచలనం సృష్టించింది…సినిమా ప్రతీ రోజూ రిమార్కబుల్ హోల్డ్ ని చూపించగా…
రెండో వీకెండ్ లో సైతం ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించి దుమ్ము దుమారం లేపింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న డబ్ మూవీ గా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ప్రీవియస్ రికార్డ్ బ్రేక్ అవ్వడానికి ఏడున్నర ఏళ్ళు పట్టింది…
2017 టైంలో ఇండియన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి2 మూవీ హిందీలో టోటల్ రన్ లో 511 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు 11 రోజుల్లో ఈ మార్క్ ని దాటేసిన పుష్ప2 మూవీ ఏకంగా 561 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు.
ఒకసారి హిందీలో రిలీజ్ అయిన సౌత్ డబ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే..
South Top 10 Hindi Dub/Direct Net Collections
1. #Pushpa2TheRule- 561.50CR(11 Days)******
2. #Baahubali2- 511Cr~
3. #KGF2– 435.2Cr
4. #Kalki2898AD – 294.50CR
5. #RRRMovie– 276.8Cr
6. #2Point0: 189Cr
7. #Salaar 1: 153.45CR
8. #Saaho: 150.6Cr
9. #AdiPurush – 143.25CR
10. #Baahubali- 115Cr
11. #Pushpa–108.61Cr
పుష్ప1 మూవీ 108 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే ఆ సినిమా కలెక్షన్స్ మీద ఆల్ మోస్ట్ 5 రెట్ల కి మించి వసూళ్ళని 11 రోజుల్లోనే అందుకున్న పుష్ప2 మూవీ ఇప్పుడు లాంగ్ రన్ లో అవలీలగా 700 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు….