వరల్డ్ వైడ్ సినీ లవర్స్ బహుశా అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రేంజ్ లో ఆసక్తిగా ఎదరు చూసేలా చేసిన సినిమా ఇదేనని చెప్పొచ్చు. లాస్ట్ 24 గంటల్లో వరల్డ్ వైడ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఆ సినిమానే స్పైడర్ మాన్ నో వే హోమ్ సినిమా ట్రైలర్… రెండు రోజుల ముందే టీసర్ లీక్ అయినా కానీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా అఫీషియల్ గా టీసర్ లాంచ్ చేయగా…
ఆ టీసర్ అద్బుతంగా ఉండటం తో రీచ్ ఊహకందని లెవల్ లో సొంతం చేసుకుని దూసుకు పోతుంది ఈ సినిమా టీసర్ ట్రైలర్. 24 గంటల్లో సోషల్ మీడియా లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసి ఊచకోత కోసింది ఈ టీసర్ ట్రైలర్… ఒక్క ట్విట్టర్ లోనే 24 గంటల్లో…
42 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని ఊచకోత కోయగా, యూట్యూబ్ లో ఒక ఛానెల్ లో 34 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని మరో ఛానెల్ లో 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సాధించింది. ఓవరాల్ రియల్ టైం వ్యూస్ పరంగా యూట్యూబ్ లో రిలీజ్ అయిన…
అన్ని ఛానెల్స్ లో కలిపి 110 మిలియన్స్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకుందట, ఇక ట్విట్టర్ లో 47 మిలియన్ వ్యూస్ ని సాధించగా ఇన్స్ట గ్రామ్ లో 63 మిలియన్ వ్యూస్ ని ఫేస్ బుక్ లో 35 మిలియన్ వ్యూస్ ని సాధించిందట. ఇక టోటల్ గా 255 మిలియన్ వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకుని భీభత్సం అంటే ఇదే అనిపించే రేంజ్ లో రచ్చ చేయగా…
ఇది వరకు అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కలిపి 24 గంటల్లో 285 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సాధించగా తర్వాత ఇప్పుడు రెండో ప్లేస్ లో స్పైడర్ మాన్ 3 నిలిచింది అంటున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 17 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.