బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ బక్రీద్(Bakrid) వీకెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన రెండు తెలుగు సినిమాలు స్పై(SPY Movie) మరియు సామజవరగమనా(Samajavaragamana) సినిమాలు డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా రెండు సినిమాలలో నిఖిల్ స్పై మూవీ పై…
మంచి అంచనాలు ఉండటంతో ఓపెనింగ్స్ పరంగా బెటర్ స్టార్ట్ ను సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. అదే టైం లో సామజవరగమనా టాక్ సూపర్ పాజిటివ్ గా ఉండటంతో షో షోకి కలెక్షన్స్ లో ఇంప్రూవ్ మెంట్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయని చెప్పాలి…
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే నిఖిల్ స్పై మూవీ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 2.2-2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సామజవరగమనా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 80 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని…
అందుకునే అవకాశం ఉంది, ఇక రెండు సినిమాలు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి రోజు మొత్తం ప్రతీ షోకి కలెక్షన్స్ పరంగా ఇంప్రూవ్ మెంట్ ని కనుక చూపిస్తే ఓపెనింగ్స్ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….
స్పై మూవీ ఓవర్సీస్ లో 150K మార్క్ ని దాటేయగా లిమిటెడ్ రిలీజ్ లో కూడా సామజవరగమనా మంచి స్టార్ట్ ను అక్కడ సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డే ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తాయో చూడాలి ఇప్పుడు.