Home న్యూస్ 90 షోలకు 80 షోలు ఔట్….ఇది మామూలు అరాచకం కాదు సామి!!

90 షోలకు 80 షోలు ఔట్….ఇది మామూలు అరాచకం కాదు సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు పెద్దగా అంచనాలను అందుకోలేక పోయిన ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindi) సినిమా తర్వాత డిజిటల్ లో మంచి వ్యూవర్ షిప్ ను అందుకోగా మీమ్స్ ద్వారా మోస్ట్ పాపులర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

ఆ రీచ్ ఇప్పుడు సినిమా రీ రిలీజ్ లో ఊహకందని రెస్పాన్స్ సినిమాకి సొంతం అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా రీ రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటగా రిలీజ్ అయినప్పటికి మించి దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి..

సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ మోస్ట్ ఒక క్రేజీ సినిమా రీ రిలీజ్ కి ఎలా ఉంటుందో అలాంటి బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఒక్క హైదరాబాదులోనే ఆల్ మోస్ట్ 90 షోలకు 80 షోలకు పైగా ఫుల్స్ పడటం అన్నది మామూలు అరాచకం కాదనే చెప్పాలి.

ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలకు ధీటుగా హౌస్ ఫుల్స్ పడ్డాయని చెప్పాలి ఇప్పుడు. మొదటి రోజు ఈ సినిమా ప్రస్తుతానికి హైదరాబాదు లో గ్రాస్ బుకింగ్స్ 55 లక్షల దాకా ఉంది. టోటల్ తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ గ్రాస్ లేక 80 లక్షలకు పైగా ఉంది…

ఇందులో బ్లాక్ అయిన సీట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో సంచలన ఓపెనింగ్స్ ని అందుకునే అవాకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. రీ రిలీజ్ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here