బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ మూవీ స్పై (SPY Movie) ఆడియన్స్ ముందుకు జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఇప్పుడు ఏర్పడ్డాయి అని చెప్పాలి.
సినిమా నిఖిల్ కెరీర్ లో అర్జున్ సురవరం(Arjun Suravaram) కార్తికేయ2(Karthikeya2) మరియు 18 పేజెస్ లాంటి హాట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కాగా అన్ని చోట్ల సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది అని చెప్పాలి. దాంతో బిజినెస్ పరంగా…
సినిమా అన్ని చోట్లా మంచి బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇది నిఖిల్ కెరీర్ లో బెస్ట్ బిజినెస్ అని చెప్పాలి ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 13 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 17.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది…
ఒకసారి సినిమా టోటల్ బిజినెస్ ను గమనిస్తే…
SPY Movie Pre Release Business(Valued)
👉Nizam: 5Cr
👉Ceeded: 2Cr
👉Andhra: 6Cr
AP-TG Total:- 13.00CR
👉Ka+ROI: 0.70Cr
👉OS – 1.80Cr
👉Other Languages (Valued) – 2Cr
Total – 17.50CR(Break Even – 18.50Cr)
సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బక్రీద్ వీకెండ్ లో రిలీజ్ అవుతూ ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 18.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే హిట్ అవుతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.