బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన సినిమా శ్రీదేవి శోభన్ బాబు….వరుస ఛాన్సులు సొంతం చేసుకుంటున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన సక్సెస్ ను అయితే అందుకోలేక పోతున్న సంతోష్ శోభన్ ఈ ఇయర్ ఆల్ రెడీ సంక్రాంతి టైంలో కళ్యాణం కమనీయంతో నిరాశ పరచగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన శ్రీదేవి శోభన్ బాబుతో అయినా మెప్పించాడో లేదో తెలుసుకుందాం పదండీ…. ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….
బావామరదళ్ళు అయిన హీరో హీరోయిన్ ఫ్యామిలీస్ కొన్ని కారణాల వలన విడిపోగా రెండు ఫ్యామిలీస్ కి కంబైన్ ఆస్తిగా ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు కోసం హీరో ట్రై చేస్తూ ఉండగా హీరోయిన్ తో తర్వాత తన లవ్ ఎలా సక్సెస్ అయింది, విడిపోయిన ఫ్యామిలీస్ ని హీరో కలిపాడా లేదా అన్నది సినిమా మిగిలిన కథ… చాలా రొటీన్ స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా సంతోష్ శోభన్ బాగానే నటించి మెప్పించగా హీరోయిన్ గా గౌరీ జి కిషన్ కూడా ఆకట్టుకుంది, కీలక రోల్స్ లో రోహిణి మరియు నాగబాబు ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు….
కథ పరమ రొటీన్ గా ఉండటం, కథనం కూడా చాలా నీరసంగా ఉండటంతో కొన్ని సీన్స్ మినహా సినిమా ఏ దశలో కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది. ఫస్టాఫ్ కే ఆడియన్స్ కి నీరసం రాగా సెకెండ్ ఆఫ్ లో వచ్చే సీన్స్ కి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆడియన్స్ కి ఏమాత్రం కనెక్ట్ కాలేదు అని చెప్పాలి. మొత్తం మీద సినిమాలో అక్కడక్కడా పేలిన కొన్ని కామెడీ సీన్స్, ఒక సాంగ్ మినహా చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు….
రొటీన్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కూడా చాలా ఓపిక చేసుకుని చూస్తె తప్ప ఈ రొటీన్ మూవీ పర్వాలేదు అనిపించడం కష్టమే… అన్ని సినిమాలు చూసేసి ఏ సినిమా చూడాలా అని ఎదురు చూసే ఆడియన్స్ ఓపిక చేసుకుని చూస్తె యావరేజ్ గా అనిపించవచ్చు… ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్….