Home న్యూస్ శ్రీదేవి సోడా సెంటర్…ఇచ్చట వాహనములు నిలుపరాదు….ఫస్ట్ డే కలెక్షన్స్!!

శ్రీదేవి సోడా సెంటర్…ఇచ్చట వాహనములు నిలుపరాదు….ఫస్ట్ డే కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ రిలీజ్ కి సిద్ధంగా అరడజను సినిమాలు సిద్ధంగా ఉండగా వాటిలో ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేసిన సినిమాలు శ్రీదేవి సోడా సెంటర్ మరియు ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలు… సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ మంచి బజ్ నే క్రియేట్ చేసుకోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కంప్లీట్ గా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అయ్యింది.

రెండు సినిమాలు ఆల్ మోస్ట్ 800 వరకు థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రిలీజ్ అవ్వగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజ్ గా జరిగినా థియేటర్స్ లో బుకింగ్స్ అండ్ ఆక్యుపెన్సీ మాస్ సెంటర్స్ లో…

బాగానే ఇంప్రూవ్ చేసుకుంటూ దూసుకు పోతుంది. దాంతో సినిమా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా ఓవరాల్ గా బుకింగ్స్ అంతంత మాత్రమె ఉండగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా బిలో యావరేజ్ లెవల్ లోనే ఉన్నాయి.

మొత్తం మీద డే స్టార్ట్ అయ్యే టైం కి శ్రీదేవి సోడా సెంటర్ 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునేలా కనిపించగా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా 20 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునేనా కనిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో శ్రీదేవి సోడా సెంటర్ మంచి గ్రోత్ నే సొంతం చేసుకోగా ఇప్పుడు 1.8 కోట్ల నుండి 2 కోట్లని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్…

ఇక సుశాంత్ సినిమా 30 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా బాగుంటే కలెక్షన్స్ లెక్క ఇంకా బెటర్ గా 2 కోట్లకు పైగా వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పాలి. మరి 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here