ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు మేజర్ గా పోటి పడబోతున్నాయి. రెండు సినిమాల బిజినెస్ రేంజ్ లు వేరు అయినా కానీ రెండు సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేసి రిలీజ్ అవుతున్న సినిమాలు అని చెప్పాలి. వాటిలో సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా సెకెండ్ పాండమిక్ తర్వాత…
ఓవరాల్ గా హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న హైయెస్ట్ బిజినెస్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా నైజాంలో 208 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఆంధ్రలో 320 థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ కౌంట్…
550 కి పైగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సుశాంత్ నటించిన ఇచ్చట వాహనుములు నిలపరాదు సినిమా నైజాంలో 103 థియేటర్స్ లో టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 240 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. శ్రీదేవి సోడా సెంటర్ వరల్డ్ వైడ్ గా 750 థియేటర్స్ లో…సుశాంత్ సిన్నిమా 350 లోపు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ఇక రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలు అవ్వగా రెండు సినిమాల్లో సుధీర్ బాబు సినిమాకి పర్వాలేదు అనిపించే బుకింగ్స్ జరుగుతున్నాయి. సుశాంత్ సినిమా కంప్లీట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మౌత్ టాక్ మీదే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతున్న సినిమా గా చెప్పుకోవాలి. కానీ టాక్ బాగుంటే డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.
మొత్తం మీద శ్రీదేవి సోడా సెంటర్ కొంచం బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. 8.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా 1.5 నుండి 1.8 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు ప్రస్తుతానికి, ఇక సుశాంత్ సినిమా 2.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా 30 నుండి 40 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు. మరి ఈ అంచనాలను మించి కలెక్ట్ చేస్తాయో లేవో చూడాలి.