Home న్యూస్ ఇద్దరికీ హిట్స్ లేవు…అయినా రికార్డ్ రేటు పలికిన మహా సముద్రం!!

ఇద్దరికీ హిట్స్ లేవు…అయినా రికార్డ్ రేటు పలికిన మహా సముద్రం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ హిట్టు కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది అప్పుడెప్పుడో 2017 టైం లో రెండు హిట్స్ కొట్టిన శర్వానంద్ మళ్ళీ ఇప్పటి వరకు క్లీన్ హిట్ ని సొంతం చేసుకోలేక పోయాడు. మరో పక్క తెలుగు లో స్ట్రైట్ మూవీస్ కి దూరం అయినా హీరో సిద్దార్థ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు లో స్ట్రైట్ మూవీ కి ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా మహా సముద్రం.

RX100 ఫేం అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ పై మంచి బజ్ నెలకొంది ఇప్పుడు, ఈ దసరా టైం లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా లో జగపతిబాబు కూడా కీలక రోల్ చేస్తూ ఉండగా పక్కా మాస్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో..

హే రంబ సాంగ్ కి ఆల్ రెడీ సాలిడ్ క్రేజ్ వచ్చింది. దాంతో సినిమా బిజినెస్ జోరు అందుకోగా అన్ని చోట్ల నుండి సినిమా కి సాలిడ్ ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా సినిమా థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ రైట్స్ కూడా రికార్డ్ రేటు కి అమ్ముడు పోయాయి.

లీడింగ్ OTT జైంట్ అయిన నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమా డిజిటల్ రైట్స్ హక్కుల కోసం ఏకంగా 10.5 కోట్ల రేంజ్ లో రేటు చెల్లించి సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను దక్కించుకున్నారట. ఇటు శర్వానంద్ కానీ అటు సిద్దార్థ్ కానీ రీసెంట్ టైం లో ఒక్క హిట్ కొట్టక పోయినా కానీ ఈ మల్టీ స్టారర్ పై బజ్ సాలిడ్ గా ఉండటం వలన ఈ రేంజ్ లో…..

డిజిటల్ రైట్స్ ఆఫర్ ను సొంతం చేసుకుందని అంటున్నారు. ఇంకా సినిమా శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా ఉండనే ఉన్నాయి. అవి కూడా సాలిడ్ రేటు ఆఫర్స్ వస్తున్నాయని టాక్ ఉంది, త్వరలోనే అవి కూడా కన్ఫాం కావొచ్చు. మొత్తం మీద ఈ ఇద్దరికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ మూవీ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here