కెరీర్ మొదలు పెట్టడం వరుస విజయాలతో మొదలు పెట్టి హాట్రిక్ విజయాలతో దుమ్ము లేపిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తర్వాత కంప్లీట్ గా ట్రాక్ తప్పాడు… ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడక పోవడంతో కెరీర్ లో మొత్తంగా డౌన్ ఫాల్ లో ఉండి పోయిన రాజ్ తరుణ్ నుండి ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ స్టాండ్ అప్ రాహుల్ రీసెంట్ గా చాలా సైలెంట్ అండ్ లిమిటెడ్ గా రిలీజ్ అయ్యింది…
సినిమా ఎలా ఉంది అన్న విషయాలను గమనిస్తే… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కం స్టాండ్ అప్ కామెడీ చేసే హీరో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో సతమతం అవుతాడు… తల్లితండ్రులు అనుకోని కారణాల వలన విడిపోవడంతో ఇక పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యే హీరో…
లైఫ్ లోకి చిన్ననాటి స్నేహితురాలు అండ్ కొలీగ్ అయిన హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు, తన నిర్ణయం మార్చుకున్నాడా లేదా అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్… స్టాండ్ అప్ కామెడీ బేస్ మూవీ అనడంతో కామెడీ ప్రధానంగా సాగే కథ అనుకుంటే చాలా వరకు నిరాశ కలిగిస్తుంది సినిమా….
కథ కథనం అన్నీ చాలా నెమ్మదిగా సాగగా కామెడీ ఒకటి రెండు సీన్స్ తప్పితే ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు, రాజ్ తరుణ్ లో మునుపటి ఎనర్జీ అయితే మిస్ అయింది అనిపించింది, హీరోయిన్ పర్వాలేదు మిగిలిన నటీనటులు జస్ట్ ఓకే అనిపించుకోగా ఫస్టాఫ్ కథ స్లో గా స్టార్ట్ అయ్యి అక్కడక్కడా ఒకటి రెండు సీన్స్ బాగున్నాయి అనిపించినా ఓవరాల్ అటు ఫస్టాఫ్ ఇటు సెకెండ్ ఆఫ్ చాలా వరకు సహనానికి పరీక్ష పెడతాయి అని చెప్పొచ్చు….
రాజ్ తరుణ్ నుండి వచ్చిన ఈ సినిమా కూడా రీసెంట్ మూవీస్ మాదిరిగానే నిరాశ పరిచే విధంగానే ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా పెద్దగా కలెక్షన్స్ ఏమి సొంతం చేసుకోలేక పోయిన సినిమా 22-25 లక్షల మధ్యలో షేర్ ని తొలిరోజు సొంతం చేసుకున్నట్లు సమాచారం…. ఇక మిగిలిన రోజుల్లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి….