Home గాసిప్స్ బాక్స్ ఆఫీస్ డిసాస్టర్…కానీ సీక్వెల్…అది కూడా పాన్ ఇండియా…బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ ఖాయం!!

బాక్స్ ఆఫీస్ డిసాస్టర్…కానీ సీక్వెల్…అది కూడా పాన్ ఇండియా…బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ ఖాయం!!

0

అప్పుడప్పుడు ఊహించని విధంగా కొన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకున్నా అంచనాలను అందుకోలేక పోతాయి. కొన్ని సినిమాలకు ఆ సత్తా ఉన్నప్పటికీ కూడా అనుకోని అవరోధాలు ఎదురు అవ్వడం లాంటివి సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపి ఎదురుదెబ్బ కొడతాయి. ఈ కోవలోకే వచ్చే సినిమాల్లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి ల కాంబినేషన్ లో రూపొందిన ప్రాజెక్ట్ Z అనే సినిమా అని చెప్పొచ్చు. ఆల్ మోస్ట్ 7 ఏళ్ల క్రితం ఈ సినిమా…

ప్రేక్షకుల ముందుకు రాగా అనేక ఇబ్బందులను ఎదురుకోవడం తో పెద్దగా సినిమా గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు, దాంతో పరుగు మధ్యలోనే ఆపేసిన ఈ సినిమా తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని డిజిటల్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వడం తో సినిమా చూసిన వాళ్ళు…

ఇంత బాగున్న సినిమా ఎలా ఫ్లాఫ్ అయ్యింది అంటూ కామెంట్ చేశారు. తమిళ్ లో మాయావన్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా ఇదే విధంగా రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కానీ డైరెక్టర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండటం తో ఇప్పుడు సినిమా కి సీక్వెల్ ను రీసెంట్ గా అనౌన్స్  చేసిన విషయం తెలిసిందే…

ఇక ఈ సీక్వెల్ తెలుగు తమిళ్ కే పరిమితం అవ్వదని ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రూపొంద బోతుందని కన్ఫాం చేశారు. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించిన న్యూస్ కూడా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతూ ఉండగా ఆల్ మోస్ట్ 45  కోట్ల రేంజ్ బడ్జెట్ లో ఈ సినిమాను తీయబోతున్నారని అంటున్నారు. సందీప్ కిషన్ మార్కెట్ దృశ్యా….

ఈ రేంజ్ బడ్జెట్ అంటే రికవరీ కష్టమే అని చెప్పొచ్చు. కానీ మొదటి పార్ట్ కి సోషల్ మీడియా లో పాండమిక్ టైంలో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ రాగా సెకెండ్ పార్ట్ ను బాగా తీస్తే..  ఫస్ట్ పార్ట్ నష్టాలు కూడా కవర్ చేయోచ్చు అన్న నమ్మకంతో డైరెక్టర్ సినిమాను ఈ రేంజ్ లో తీయబోతున్నారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సందీప్ కిషన్ నటించిన ఊరుపేరు భైరవకొన తర్వాత ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here