కోలివుడ్ స్టార్ హీరో సూర్య తన గొప్ప మనసును చాటుకున్నాడు… రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాలు లేని కారణంగా తన మార్కెట్ కొద్దిగా డౌన్ అవ్వగా వ్యక్తిగత కారణాల వల్ల కూడా తనకి కొన్ని అప్పులు అయ్యాయి అని రీసెంట్ గా తన భార్య జ్యోతిక నటించిన పోన్మగల్ వందాన్ సినిమా డిజిటల్ రిలీజ్ టైం లో గొడవ చేసిన వాళ్లకి కౌంటర్ గా చెప్పాడు సూర్య..
ఆ సినిమా ను డిజిటల్ రిలీజ్ చేయకూడదని గొడవ పెట్టగా నిర్మాతగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని, అయినా నాకు 70 కోట్ల దాకా అప్పు ఉందని అది మీరు తీరుస్తారా అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు సూర్య. అదే విధంగా మంచి రేటు ఆఫర్ రాగా తను నటించిన…
లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దుగా సినిమా ను కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయగా అప్పుడు కూడా అందరూ గొడవ చేస్తున్న టైం లో ముందుగానే ఈ సినిమా ప్రాఫిట్స్ నుండి 5 కోట్లు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటానని మాట ఇచ్చి సినిమా హక్కులను అమ్మాడు.
అమ్మకం జరిగిన తరువాత ఇప్పుడు అప్పులు ఇంకా కొన్ని ఉన్నా కానీ తను చెప్పినట్లే 5 కోట్లు వివిధ శాఖలకు ఇచ్చాడు సూర్య… 2.5 కోట్లు కరోనా వల్ల చదువులకు దూరం అయిన పిల్లల చదువుల కోసం ఇవ్వగా 1.5 కోట్లను ఇండస్ట్రీ లో ఇబ్బందులు పడుతున్న వారికి వర్కర్స్ యూనియన్ కి మరియు యూనియన్ అసోసియేషన్ వాళ్లకి ఇచ్చాడు సూర్య.
ఇక మరో కోటిని ఇండస్ట్రీ PRO లకు, ట్రేడ్ విశ్లేషకులకు అలాగే ఖాళీ గా ఉన్న తన అభిమాన సంఘాల నాయకులకు ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశారట. మొత్తం మీద అన్ని కలిపి 5 కోట్లు ఇస్తున్నాని చెప్పినట్లే ఇచ్చి శెభాష్ అని అందరి చేతా అనిపించుకున్నాడు సూర్య… ఇక సూర్య నటించిన ఆకాశం నీ హద్దుగా సినిమా అక్టోబర్ 30 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే…