Home న్యూస్ వకీల్ సాబ్ మోషన్ పోస్టర్….కుమ్మిందిగా!!

వకీల్ సాబ్ మోషన్ పోస్టర్….కుమ్మిందిగా!!

0

ఆల్ మోస్ట్ రెండున్నర ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతున్న సినిమా టీసర్/మోషన్ పోస్టర్ మొదటి సారి చూస్తున్నారు అభిమానులు. అజ్ఞాతవాసి తర్వాత ఇక సినిమాలు చేయడు రాజేకీయాలకే పరిమితం అనుకున్నా కానీ వ్యక్తిగత కారణాల వల్ల మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాను అంటూ తనని వెండితెరపై చూడాలి అనుకున్న వాళ్లకి అల్టిమేట్ కిక్ ఇచ్చిన పవర్ స్టార్ ముందు కమిట్ అయిన సినిమా వకీల్ సాబ్.

హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను తమిళ్ లో అజిత్ కుమార్ రీమేక్ చేయగా అదే కథని మరిన్ని మార్పులతో ఇప్పుడు పవర్ స్టార్ తో రీమేక్ చేస్తున్నారు. ఎప్పుడో సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల పోస్ట్ పోన్ లు అవ్వగా…

సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున సినిమా అఫీషియల్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. తమన్ అందించిన కూల్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించాగా లాయర్ గెటప్ లో పవన్ కళ్యాణ్ లుక్ బాగుందని చెప్పాలి.

చేతిలో బేస్ బాల బ్యాట్ తో పవన్ కళ్యాణ్ లాయర్ లుక్ అటు క్లాస్ ఇటు మాస్ రెండూ టచ్ చేయడం విశేషం. చాలా సెన్సిటివ్ సినిమాగా హిందీ లో రూపొందిన సినిమాను తెలుగు కి వచ్చే సరికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృశ్యా మాస్ ఎలిమెంట్స్ లో రూపొందించారని సమాచారం… మరికొంత భాగం షూటింగ్ బాలెన్స్ ఉన్న ఈ సినిమా…

వచ్చే ఏడాదే ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు. ఒకవేళ సినిమా షూటింగ్ త్వరలో మొదలు అయితే సంక్రాంతి రేసులో నిలిచే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక మోషన్ పోస్టర్ కుమ్మేయడం తో ఫ్యాన్స్ ఇప్పుడు హైయెస్ట్ లైక్స్ ని మోషన్ పోస్టర్ కి దక్కేలా దుమ్ము లేపాలని చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here