తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోలలో సూర్య కూడా ఒకరు అని చెప్పాలి. రజినీ తర్వాత తెలుగు లో అంతటి క్రేజ్ ను దక్కించుకున్న సూర్య ఆ క్రేజ్ ని అలానే మెయిన్ టైన్ చేయలేక పోయాడు, ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి నిరాశ పరిచే సినిమాలను చేస్తూ వచ్చిన సూర్య తన మార్కెట్ ని ఎప్పటి కప్పుడు ఇక్కడ….
కోల్పోతూ వచ్చాడు, రీసెంట్ టైం లో ఆకాశం నీ హద్దురా మరియు జై భీమ్ లాంటి సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాలుగా నిలిచాయి, ఆ సినిమాలను తెలుగు లో కూడా డిజిటల్ లో ఎగబడి చూశారు, అలాంటి డిజిటల్ హిట్స్ తర్వాత సూర్య నుండి ఇప్పుడు….
ఆడియన్స్ ముందుకు వస్తున్న కొత్త సినిమా ET ఎవ్వరికీ తలవంచకు సినిమా ఈ గురువారం రిలీజ్ కానుండగా ఒక్క రోజు గ్యాప్ లో రాధే శ్యామ్ కూడా రిలీజ్ కానున్న నేపధ్యంలో తెలుగు లో ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు… ఇక సినిమా తెలుగు బిజినెస్ విషయానికి వస్తే….
నైజాం ఏరియాలో సినిమా 1.2 కోట్ల బిజినెస్ జరగగా, సీడెడ్ లో 80 లక్షల రేంజ్ లో ఆంధ్ర రీజన్ లో 1.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఓవరాల్ గా జరిగినట్లు సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు లో హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి.
సోలో రిలీజ్ అయ్యి ఉంటే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు కానీ రాధే శ్యామ్ లాంటి మమ్మోత్ మూవీ తో పోటి లో ఈ సినిమా ఎంతవరకు ఈ కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తి కరం, కొంచం గ్యాప్ తర్వాత కమర్షియల్ మూవీ చేస్తున్న సూర్య ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి.