కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న తమిళ్ హీరో లలో సూర్య కూడా ఒకరు. ఒకప్పుడు అక్కడా ఇక్కడ వరుస విజయాల తో దుమ్ము లేపిన సూర్య తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేక పోతున్నాడు. తెలుగు లో సింగం 2, 24 సినిమాలు మాత్రమె కొంత వరకు ఆకట్టుకోగా తర్వాత చేసిన సినిమాలు నిరాశనే మిగిలించాయి. అయినా కానీ సూర్య కి తెలుగు లో కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి.
సూర్య సెల్వ రాఘవన్ ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ NGK ముందుగా దీపావళి కే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా సినిమా కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఏడాది జనవరి 24 న రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ కాబోతుందని సమాచారం.
కాగా ఈ సినిమా కి తెలుగు లో బిజినెస్ పరంగా 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ దక్కుతున్నట్లు సమాచారం. ఇందులో ఏ ఆఫర్ ఫైనల్ అవుతుందో తెలియదు కానీ ఫ్లాఫ్స్ లో ఉన్నా సూర్య క్రేజ్ మాత్రం తగ్గడం లేదు అని చెప్పొచ్చు. సినిమా టీసర్ త్వరలోనే రిలీజ్ కానుందట.